Telugu Global
Telangana

మరో ఏడుగురు అధికారుల బదిలీ.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు షాక్‌

రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ భారతి హొలికేరికి ప్ర‌భుత్వం షాక్‌ ఇచ్చింది. ఆమెకు పోస్టింగ్ ఇవ్వకుండా GADలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఆమె స్థానంలో మేడ్చల్ జిల్లా కలెక్టర్‌గా ఉన్న గౌతమ్‌ పొట్రుకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించింది.

మరో ఏడుగురు అధికారుల బదిలీ.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు షాక్‌
X

తెలంగాణలో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల బదిలీలు కొనసాగుతున్నాయి. తాజాగా మరో ఆరుగురు ఐఏఎస్‌ అధికారులు, ఓ ఐపీఎస్‌ అధికారికి స్థానచలనం కల్పించింది ప్రభుత్వం. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ భారతి హొలికేరికి ప్ర‌భుత్వం షాక్‌ ఇచ్చింది. ఆమెకు పోస్టింగ్ ఇవ్వకుండా GADలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఆమె స్థానంలో మేడ్చల్ జిల్లా కలెక్టర్‌గా ఉన్న గౌతమ్‌ పొట్రుకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇక ఐపీఎస్‌ ఆఫీసర్‌ డి.ఎస్‌.చౌహాన్‌కు సివిల్ సప్లయ్ కమిషనర్‌గా బాధ్యతలు కట్టబెట్టింది.

తాజా బదిలీలు ఇవే -

- రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భారతీ హొలికెరిపై వేటు

- GADలో రిపోర్టు చేయాలని ఆదేశం

- రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా గౌతమ్‌ పొట్రుకు పూర్తి అదనపు బాధ్యతలు

- సివిల్ సప్లయ్ కమిషనర్‌గా డీ.ఎస్‌.చౌహాన్‌

- ఇంటర్‌ విద్య డైరెక్టర్‌గా శృతి ఓజా

- ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌గా ఇ.శ్రీధర్‌

- గిరిజన సంక్షేమ శాఖ ఈవీ నర్సింహ రెడ్డి

- ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌ జ్యోతి బుద్ధప్రకాష్‌

First Published:  24 Dec 2023 2:07 PM GMT
Next Story