IAS అధికారుల బదిలీ.. ఆమ్రపాలికి కీలక పదవి
ఇంధన శాఖ సెక్రటరీగా అలీ ముర్తుజా రిజ్విని నియమించింది. ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీగానూ రిజ్వికి అదనపు బాధ్యతలు ఇచ్చింది.
తెలంగాణ ప్రభుత్వం పలువురు IAS అధికారులను బదిలీ చేసింది. ట్రాన్స్‌కో, జెన్‌కో సహా వివిధ శాఖలకు చెందిన పలువురు అధికారులకు స్థానచలనం కల్పించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క OSDగా కృష్ణభాస్కర్‌ను నియమించింది. ఇంధన శాఖ సెక్రటరీగా అలీ ముర్తుజా రిజ్విని నియమించింది. ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీగానూ రిజ్వికి అదనపు బాధ్యతలు ఇచ్చింది. ఇక ఇటీవలే రాష్ట్ర సర్వీసులోకి వచ్చిన IAS ఆఫీసర్ ఆమ్రపాలిని HMDA జాయింట్ కమిషనర్‌గా నియమించింది ప్రభుత్వం. మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఇన్‌ఛార్జి MDగానూ ఆమ్రపాలికి అదనపు బాధ్యతలు ఇచ్చింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
ఆమ్రపాలి - HMDA జాయింట్ కమిషనర్, మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీగా అదనపు బాధ్యతలు
సయిద్ రిజ్వి - ఇంధన శాఖ కార్యదర్శి, ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ
సందీప్ ఝా- ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్
కృష్ణ భాస్కర్ - డిప్యూటీ సీఎం OSD
కర్ణాటి వరుణ్ రెడ్డి - TSNPDCL CMD
ముషారఫ్ అలీ - TSSPDCL CMD
శైలజా రామయ్యర్ - వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి
బి.గోపి - వ్యవసాయ శాఖ డైరెక్టర్