Telugu Global
Telangana

హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో రేపటి నుంచి 90 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఐటీ సెక్టార్‌లో కొత్త ఫ్లైవోవర్ నిర్మాణం ప్రారంభమైంది. దీంతో ఈ రూట్‌లో రేపటి నుంచి 90 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు ఉండబోతున్నాయి.

Traffic restrictions in Hyderabad IT Corridor
X

హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో రేపటి నుంచి 90 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ నగరంలో నానాటికీ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించే చర్యల్లో భాగంగా ప్రభుత్వం అనేక ఫ్లైవోర్లు, కొత్త కనెక్టింగ్ రహదారులు, అండర్ పాస్‌లు నిర్మిస్తోంది. దీంతో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు తప్పడం లేదు. ప్రజలు, వాహనదారులు ఈ నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాల నుంచి వెళ్లకుండా, ప్రత్యామ్నాయ రహదారులను చూసుకోవాలిని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. తాజాగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఐటీ సెక్టార్‌లో కొత్త ఫ్లైవోవర్ నిర్మాణం ప్రారంభమైంది. దీంతో ఈ రూట్‌లో రేపటి నుంచి 90 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు ఉండబోతున్నాయి.

శిల్పా లేఅవుట్ ఫేస్-2 వద్ద ఫ్లైవోవర్ నిర్మాణ పనులను చేపట్టడానికి వీలుగా మే 13 నుంచి అగస్టు 10 వరకు 90 రోజుల పాటు ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. గచ్చిబౌలి జంక్షన్ నుంచి కొండాపూర్ వైపు వెళ్లే మార్గాన్ని పూర్తిగా మూసివేయనున్నారు. వాహనదారులకు ప్రత్యామ్నాయ మార్గాలను కూడా పోలీసులు సూచించారు.

- గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్ నుంచి కొండాపూర్ వైపునకు వచ్చే వాహనాలను గచ్చిబౌలి శిల్పాలేఅవుట్ ఫ్లైవోవర్ వద్ద దారి మళ్లిస్తారు. ఈ వాహనాలను మీనాక్షి టవర్స్, డెలాయిటట్, ఏఐజీ హాస్పిటల్, క్యూమార్ట్ మీదుగా కొత్తగూడ ఫ్లైవోవర్, కొండాపూర్, హఫీజ్‌పేట వైపు మళ్లిస్తారు.

లింగపల్లి నుంచి కొండాపూర్ వైపు వచ్చే వాహనాలను గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద దారి మళ్లించి.. డీఎల్ఎఫ్ ఐటీ పార్క్, రాడిసన్ హోటల్ మీదుగా కొండాపూర్ వైపు అనుమతిస్తారు.




- గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ ప్రాంతంలోని విప్రో జంక్షన్ నుంచి ఆల్విన్ కాలనీ వైపు వెళ్లే వాహనదారులు.. ట్రిపుల్ ఐటీ జంక్షన్ మీదుగా గచ్చిబౌలి స్టేడియం వద్ద యూటర్న్ తీసుకొని గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి డీఎల్ఎఫ్ ఐటీ పార్క్, రాడిసన్ హోటల్, కొండాపూర్ మీదుగా ఆల్విన్ కాలనీ వైపు అనుమతిస్తారు.

- టోలీచౌకీ నుంచి ఆల్విన్ జంక్షన్ వైపు వచ్చే వాహనాలు.. గచ్చిబౌలి బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద యూటర్న్ తీసుకొని మైండ్‌స్పేస్, సైబర్ టవర్స్ జంక్షన్ మీదుగా కొత్తగూడ, కొండాపూర్ వైపు వెళ్లాలి.

- గచ్చిబౌలి టెలికాంనగర్ నుంచి కొండాపూర్ వెళ్లాల్సిన వాహనాలు.. గచ్చిబౌలి ఫ్లైవోవర్ కింద యూటర్న్ తీసుకొని.. శిల్పా లేఅవుట్ ఫ్లైవోవర్, మీనాక్షి టవర్స్, డెలాయిట్ మీదుగా కొండాపూర్ వెళ్లాలి.

- ఆల్విన్ జంక్షన్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లే వాహనదారులు కొత్తగూడ జంక్షన్ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకొని హైటెక్స్ రోడ్, సైబర్ టవర్స్, మైండ్‌స్పేస్ జంక్షన్, శిల్పాలేఅవుట్ మీదుగా గచ్చిబౌలి వెళ్లాలి.

- ఆల్విన్ కాలనీ నుంచి లింగంపల్లి వెళ్లే వాహనాలు బొటానికల్ గార్డెన్ జంక్షన్ వద్ద రైట్ టర్న్ తీసుకొని శ్రీరాంనగర్ కాలనీ, మసీద్‌బండ, హెచ్‌సీయూ మీదుగా లింగంపల్లి వెళ్లాలని పోలీసులు సూచించారు.

First Published:  12 May 2023 1:44 PM IST
Next Story