తెలంగాణ ఇవ్వడం నష్టమే - రేవంత్ రెడ్డి
సాంకేతికంగా లెక్కలేసుకుంటే రాష్ట్రం ఇవ్వడానికి ఏ మాత్రం అవకాశం లేదన్నారు. రాజకీయ కోణంలో చూసినా ఏ మాత్రం ప్రయోజనం లేదన్నారు.
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి నోరు జారారు. ఇప్పటికే ఉచిత కరెంటు, రైతుబంధు విషయంలో ఆ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీగా మారిన విషయం తెలిసిందే. తాజాగా ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి.
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఏమన్నారంటే.. సాంకేతికంగా లెక్కలేసుకుంటే రాష్ట్రం ఇవ్వడానికి ఏ మాత్రం అవకాశం లేదన్నారు. రాజకీయ కోణంలో చూసినా ఏ మాత్రం ప్రయోజనం లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నష్టం చేకూర్చే నిర్ణయమేనన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రేవంత్ రెడ్డి అసలు రూపం ఇదంటూ బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.
తెలంగాణ ఇవ్వడం అనేది నష్టం చేకూర్చే నిర్ణయం. ఆరోజు తెలంగాణ ఇవ్వడానికి ఏ కోశానా కూడా అవకాశం లేదు - టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి pic.twitter.com/ldvdGAi4Wt
— Telugu Scribe (@TeluguScribe) November 3, 2023
ఇప్పటికే రైతుబంధు దుబారా చేస్తున్నారంటూ ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలను ప్రతి సభలో ప్రస్తావిస్తున్నారు సీఎం కేసీఆర్. గతంలో అమెరికా పర్యటనలో ఉచిత కరెంట్ విషయంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సైతం వివాదాస్పదమయ్యాయి.