వెంకన్న మా వాడే .. కావాలనే కొందరు గ్యాప్ క్రియేట్ చేస్తున్నారు - రేవంత్ వివరణ
ఢిల్లీలో రాజగోపాల్ రెడ్డి టార్గెట్‌గా రేవంత్ చెలరేగిపోయారు. కోమటిరెడ్డి బ్రాండ్ కాంగ్రెస్ ఇచ్చిందని తిట్టిపోశారు. దీంతో వెంకటరెడ్డికి కోపమొచ్చింది. రేవంత్ తమని అలా అంటారా? తమ్ముడు వేరు...తాను వేరు అని చెప్పుకొచ్చారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
కోమటిరెడ్డి బ్రదర్స్.. మొన్నటిదాకా ఒకటే పార్టీ. కానీ ఇప్పుడు వేర్వేరు దారులు. దీంతో కోమటిరెడ్డి ఇంట్లో సమస్య వచ్చి పడింది. ఇటు కాంగ్రెస్ వాళ్లు కూడా రాజగోపాల్‌నుగా టార్గెట్ చేస్తున్నారు. పనిలో పనిగా కోమటిరెడ్డి ఇంటి పేరు పెట్టి మరీ చీల్చిచెండాతున్నారు. దీంతో అసలు సమస్య వచ్చి పడింది అన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి.. ఆయన ఇప్పటికీ కాంగ్రెస్ నేతే.. ఢిల్లీ ధర్నాలో పాల్గొంటున్నారు.. కాంగ్రెస్‌వాదినని చెప్పుకుంటున్నారు.
ఢిల్లీలో రాజగోపాల్ రెడ్డి టార్గెట్‌గా రేవంత్ చెలరేగిపోయారు. కోమటిరెడ్డి బ్రాండ్ కాంగ్రెస్ ఇచ్చిందని తిట్టిపోశారు. దీంతో వెంకటరెడ్డికి కోపమొచ్చింది. రేవంత్ తమని అలా అంటారా? తమ్ముడు వేరు...తాను వేరు అని చెప్పుకొచ్చారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో రేవంత్ వివరణ ఇచ్చారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వేరు....వెంకటరెడ్డి వేరు అని అన్నారు,
కొన్ని టీవీ చానళ్లలో పనిచేస్తున్న ఉద్యోగులు కావాలనే తమ మధ్య గ్యాప్ పెంచాలని చూస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. సోనియాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కోసం కోమటిరెడ్డి బలంగా పనిచేస్తున్నారని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంటారని తెలిపారు. రాజగోపాల్ రెడ్డి పార్టీ ద్రోహి అని... వ్యాపారాల కోసమే పార్టీ మారడని మరోసారి దుమ్మెత్తిపోశారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే రాజగోపాల్... కాంగ్రెస్ వల్లే ఈ స్థాయికి వచ్చారని అన్నారు. తాను మాట్లాడిన మాటలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి కాదని.. ఆయన గౌరవాన్ని తగ్గించే విధంగా ఎక్కడా మాట్లాడలేదని ఢిల్లీలో రేవంత్ వివరణ ఇచ్చారు.
రాజగోపాల్ రెడ్డితో బహిరంగ చర్చకు సిద్ధమని రేవంత్ సవాల్ విసిరారు. ఆయన ఈ స్థాయికి రావడానికి కారణమైన కాంట్రాక్ట్‌లపై చర్చిద్దాం రా అంటూ రాజగోపాల్‌కు పిలుపు ఇచ్చారు. ఎనిమిదేళ్లలో కేసీఆర్ సర్కార్‌పై రాజగోపాల్ పోరాడలేదని విమర్శించారు. రాజగోపాల్ కులగురువు కేసీఆర్ అని చెప్పారు. మునుగోడు అభ్యర్థులపై ఇంకా చర్చ జరగలేదని వివరించారు.