Telugu Global
Telangana

'తెలంగాణలో మొత్తం కుటుంబాలు ఒక కోటి....వాహనాలు కోటి 53 లక్షలు'

ఎన్ని ఫ్లై ఓవర్లున్నప్పటికీ రోడ్ల‌పై ఎప్పుడూ ట్రాఫిక్ జాం లు అవుతూనే ఉంటాయి. అంతగా వాహనాల సంఖ్య పెరిగిపోయింది హైదరాబాద్ లో. తెలంగాణలో మొత్త‍‍ం ఒక కోటి కుటుంబాలు ఉంటే వాహనాలు మాత్రం ఒక కోటి 53 లక్షలున్నాయి.

తెలంగాణలో మొత్తం కుటుంబాలు ఒక కోటి....వాహనాలు కోటి 53 లక్షలు
X

దేశంలో రోజు రోజుకు వ్యక్తిగత వాహనాల స‍ంఖ్య‌ పెరిగిపోతోంది. అందులోనూ తెలంగాణలో అది మరింత ఎక్కువగా ఉన్నది. హైదరాబాద్ రోడ్లలో ఎక్కడ చూసినా వాహనాల ర్యాలీలాగా కనపడుతుంది. ఎన్ని ఫ్లై ఓవర్లున్నప్పటికీ రోడ్ల‌పై ఎప్పుడూ ట్రాఫిక్ జాం లు అవుతూనే ఉంటాయి. అంతగా వాహనాల సంఖ్య పెరిగిపోయింది హైదరాబాద్ లో. వాహనాలు ఎంతగా పెరిగిపోయాయంటే తెలంగాణలో మొత్త‍‍ం ఒక కోటి కుటుంబాలు ఉంటే వాహనాలు మాత్రం ఒక కోటి 53 లక్షలున్నాయి.

ఈ వివరాలను అసెంబ్లీలో వెల్లడించిన రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాష్ట్రంలో వాహనాలు రోజు రోజుకు మరింతగా పెరుగుతున్నాయని చెప్పారు. ఫ్యాన్సీ నెంబర్ ల ఈ బిడ్డింగ్ వల్ల ప్రభుత్వానికి 231 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని ఆయన తెలిపారు. మరో వైపు ఆర్టీసీకి ప్రతి రోజు 1కోటి 77 లక్షల నష్టం వాటిల్లుతోందని అజయ్ కుమార్ తెలిపారు.

రాష్ట్రంలో త్వరలో 1360 ఎలక్ట్రిక్ బస్సులను అద్దెకు తీసుకొని ప్రయాణీకులకు అందుబాటులోకి తెస్తామని మంత్రి చెప్పారు. ఈ ఏడాది కొత్తగా 776 కొత్త బస్సులలు ఆర్డర్ చేశామని తెలిపారు. తెల‍ంగాణలోని 26 ఆర్టీసీ డిపోలు లాభాల్లో ఉన్నాయని, మిగతావాటిని కూడా లాభాల బాటలోకి తేవడానికి కృషి చేస్తున్నామని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు.

First Published:  12 Feb 2023 6:24 AM GMT
Next Story