హైదరాబాద్‌లో కుండపోత వర్షం..జీహెచ్‌ఎంసీ అలర్ట్
హైదరాబాద్ నగరంలో ఎడతెరపిలేని వర్షం కురుస్తుంది. రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
BY Vamshi Kotas24 Sept 2024 6:31 PM IST

X
Vamshi Kotas Updated On: 24 Sept 2024 6:31 PM IST
హైదరాబాద్ నగరంలో ఎడతెరపిలేని వర్షం కురుస్తుంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, కొండాపూర్, మియాపూర్, గచ్చిబౌలి అమీర్‌పేట్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతుంది. రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఆఫీసు నుంచి బయటకు వస్తున్న ప్రయాణికులు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. భారీ వర్ష సూచన నేపథ్యంలో అధికారులు సైతం అలర్ట్ అయ్యారు. ప్రజలను అప్రమత్తం చేస్తూ సూచనలు జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు తమ తమ ఇళ్ల నుంచి అవసరమైతే తప్ప బయటకు రావొద్దని తెలిపారు. జిల్లాల్లో వ్యవసాయ పనులకు వెళ్లిన వారు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సూచించారు. చెట్ల కింద, బహిరంగ ప్రాంతాల్లో ఉండకూడదని సూచించారు.
Next Story