Telugu Global
Telangana

హైదరాబాద్‌లో కుండబోత వర్షం..పలు ప్రాంతాల్లో జలమయం

హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.

హైదరాబాద్‌లో కుండబోత వర్షం..పలు ప్రాంతాల్లో జలమయం
X

హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం దంచి కొడుతుంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలయమయి రోడ్లు చెరువులుగా తలపించున్నాయి. కొండాపూర్‌‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, బేగంపేట, పంజాగుట్ట సికింద్రాబాద్‌, ఉప్పల్‌,బోడుప్పల్‌, నాగోల్‌, దిల్‌సుఖ్‌నగర్‌, చైతన్యపురి ప్రాంతాల్లో అతి భారీ వర్షం పడింది. భారీ వర్షంతో రోడ్లపై వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వర్షం కారణంగా పలు ప్రధాన రోడ్లపై ట్రాఫిక్‌జామ్‌ అయింది. కాగా, శుక్రవారం రాత్రి నగరమంతా రెండు గంటలపాటు భారీ వర్షం పడిన విషయం తెలిసిందే. భారీ వర్షం కారణంగా నిలిచిన నీళ్లు పూర్తిగా తొలగక ముందే మళ్లీ వర్షం పడడంతో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి. మరోవైపు ట్రాఫిక్ జామ్‌తో ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.

తక్కువ సమయంలో ఎక్కువ వర్షం పడడంతో నాళాల వద్ద వరద ప్రవాహం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని మాన్ హోల్స్ వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో నగరంలో వచ్చే రెండు గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఎ , వాటర్ వర్క్స్ , విద్యుత్ ,పోలీస్ సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సూచించారు. డిఆర్ఎఫ్ , ఎన్డిఆర్ఎఫ్ బృందాలు , ఇతర విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిస్తే లోతట్టు ప్రాంతాల్లో ,ముంపు ప్రాంతాల్లో ఇబ్బందులు లేకుండా ఉండడంతో పాటు , ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని అధికారులకు తెలిపారు.. హైదరాబాద్ లో భారీ వర్షం కురిసినప్పుడు నీళ్ళు నిల్వ ఉండే 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద జీహెచ్ఎంసీ సిబ్బంది అక్కడే ఉండి నీళ్ళు వెంటనే వెళ్ళేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

First Published:  21 Sept 2024 2:44 PM GMT
Next Story