హైదరాబాద్‌లో కుండపోత వర్షం
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. తెలంగాణలో రాగల రెండు, మూడురోజులు వానలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, మాదాపూర్, కొండాపూర్, చందానగర్, లింగంపల్లి, బోరబండ సహా మరికొన్ని చోట్ల వాన కురుస్తోంది. తెలంగాణలో రాగల రెండు, మూడురోజులు వానలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతం, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరంలో ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతుందని పేర్కొంది.
రాష్ట్రంలో శుక్రవారం పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాపల్లి, ములుగు, మహమూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్క వానలు పడే అవకాశాలున్నాయని ఐఎండీ పేర్కొంది