Telugu Global
Telangana

తెలంగాణలోని ఆ 20 చోట్ల ఈ రోజు ఉష్ణోగ్రత‌ 40 డిగ్రీలు దాటింది

తెలంగాణలోని లక్మాపూర్, దస్తూరాబాద్, పాల్డా, ఈసాల తక్కళ్లపల్లి గ్రామాల్లో ఈ రోజు 44 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

తెలంగాణలోని ఆ 20 చోట్ల ఈ రోజు ఉష్ణోగ్రత‌ 40 డిగ్రీలు దాటింది
X

తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ ప్రకారం, తెలంగాణలోని లక్మాపూర్, దస్తూరాబాద్, పాల్డా, ఈసాల తక్కళ్లపల్లి గ్రామాల్లో ఈరోజు 44 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


ఈ రోజు తెలంగాణలో అత్య‌ధిక ఉష్ణోగ్రతలు నమోదైన టాప్ 20 గ్రామాలు:

ఈరోజు నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం లక్మాపూర్ గ్రామంలో గరిష్ట ఉష్ణోగ్రత 44.3 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది.

నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలో 44.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది

నిజామాబాద్ రూరల్‌లోని పాల్డా గ్రామంలో 44.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది

పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఈసాల తక్కళ్లపల్లి గ్రామంలో 44.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.

రాజన్న సిరిసిల్ల జిల్లా నిజాంబాద్ మండలంలో 43.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో 43.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది

మహబూబ్‌నగర్ జిల్లా చినత కుంట మండలం లోని వడ్డెమాన్‌లో 43.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.

నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) మండలంలో 43.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది

ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలంలో 43.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో 43.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో 43.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది

కుమురం భీమ్ జిల్లా కెరమెరి మండలంలో 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది

పెద్దపల్లి జిల్లా పాల్తెం గ్రామంలో 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచునపల్లి మండలం గరిమెళ్లపాడు గ్రామంలో 42.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.

నల్గొండ జిల్లా కట్టంగూరు మండలంలో 42.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది

వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలం కేతేపల్లి గ్రామంలో 42.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.

నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం పజ్జూరు గ్రామంలో 42.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో 42.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది

జయశంకర్ జిల్లా మహదేవపూర్ మండలంలో 42.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది

నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లె మండలంలో 42.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది

ఇవి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన 20 గ్రామాలుమాత్రమే ఇవికాక ఇంకా అనేక గ్రామాలు 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల కన్నా ఎక్కువే నమోదయ్యాయి.

First Published:  12 April 2023 7:50 PM IST
Next Story