రేపు పరేడ్ గ్రౌండ్‌లో జరగాల్సిన BRS సభ రద్దు..!
సభ నిర్వహణకు సంబంధించి ఇప్పటికే రక్షణశాఖ అనుమతులు కూడా తీసుకున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో పనులు సభకు సంబంధించిన ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి
BY Telugu Global24 Nov 2023 10:48 AM IST

X
Telugu Global Updated On: 24 Nov 2023 10:48 AM IST
సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో శనివారం బీఆర్ఎస్ నిర్వహించ తలపెట్టిన ప్రజా ఆశీర్వాద సభ రద్దయింది. భారీ వర్షాల నేపథ్యంలో సభను రద్దు చేయాలని పార్టీ నిర్ణయించినట్లు సమాచారం.
తెలంగాణ వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాద సభలతో దూసుకుపోతున్న బీఆర్ఎస్.. GHMC పరిధిలోని నియోజకవర్గాలన్నింటికి కలిపి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ నిర్వహించాలని ప్లాన్ చేసింది. ఈ సభకు సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉంది.
సభ నిర్వహణకు సంబంధించి ఇప్పటికే రక్షణశాఖ అనుమతులు కూడా తీసుకున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో పనులు సభకు సంబంధించిన ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. అయితే భారీ వర్షాల నేపథ్యంలో సభను రద్దు చేసుకుంటున్నట్లు బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది.
Next Story