Telugu Global
Telangana

ట‌మాటా ధ‌ర భారీగా ప‌తనం - దిక్కు తోచని స్థితిలో రైతన్నలు

ట‌మాటా ధ‌రలు దారుణంగా ప‌డిపోవ‌డంతో రైతులు దిక్కుతోచ‌ని స్థితిలో ఉన్నారు. మార్కెట్‌కు తీసుకొచ్చిన ట‌మాటాను ప‌డిపోయిన ధ‌ర‌ల‌కు అమ్మ‌లేక‌.. వాటిని తిరిగి తీసుకెళ్ల‌లేక మార్కెట్లోనే పార‌బోస్తున్నారు. క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర ద‌క్కేలా ప్ర‌భుత్వాలు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రైతులు విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.

ట‌మాటా ధ‌ర భారీగా ప‌తనం - దిక్కు తోచని స్థితిలో రైతన్నలు
X

ట‌మాటా ధ‌ర భారీగా ప‌త‌న‌మైంది. క‌ర్నూలు, వ‌రంగ‌ల్ జిల్లాల్లో మంగ‌ళ‌వారం నాడు ట‌మాటా కేజీ ధ‌ర రెండు రూపాయ‌లు మాత్ర‌మే ప‌లుకుతోంది. క‌ర్నూలు ప‌త్తికొండ మార్కెట్‌లో ట‌మాటా ధ‌ర‌లు దారుణంగా ప‌డిపోయాయి. అమ్మ‌బోతే అడవి.. కొన‌బోతే కొరివిలా త‌యారైంది రైత‌న్న‌ల ప‌రిస్థితి. దీంతో రైత‌న్న‌లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. గిట్టుబాటు ధ‌ర కాదు క‌దా.. మ‌ద్ద‌తు ధ‌ర కూడా దొర‌క‌ని ప‌రిస్థితి రైతుల‌కు నెల‌కొంది.

దారుణంగా ధ‌ర‌లు ప‌డిపోవ‌డంతో రైతులు దిక్కుతోచ‌ని స్థితిలో ఉన్నారు. మార్కెట్‌కు తీసుకొచ్చిన ట‌మాటాను ప‌డిపోయిన ధ‌ర‌ల‌కు అమ్మ‌లేక‌.. వాటిని తిరిగి తీసుకెళ్ల‌లేక మార్కెట్లోనే పార‌బోస్తున్నారు. క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర ద‌క్కేలా ప్ర‌భుత్వాలు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రైతులు విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.

మ‌రోప‌క్క వ‌రంగ‌ల్ మార్కెట్‌లో కూడా ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. ప‌దిరోజుల క్రితం వ‌ర‌కు కిలో రూ.40 వ‌ర‌కు ప‌లికిన ట‌మాటా ధ‌ర సోమ‌వారం నుంచి కిలో రూ.10కి ప‌డిపోయింది. ఒక్క‌సారిగా ధ‌ర‌లు ప‌డిపోవ‌డంపై రైతులు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ట‌మాటాను పొలం నుంచి కోసి మార్కెట్‌కు త‌ర‌లించేందుకు అయ్యే ఖ‌ర్చు కూడా త‌మ‌కు ద‌క్క‌డం లేద‌ని వాపోతున్నారు.

First Published:  29 Nov 2022 3:13 PM IST
Next Story