Telugu Global
Telangana

దానాలన్నిటిలో టమాటా దానం గొప్పది..!

కూతురు పుట్టినరోజుకి ఎవరైనా అన్నదానం చేస్తారు, అది సహజమే. అయితే కూతురికి ఆ పుట్టినరోజు ఎప్పటికీ గుర్తుండి పోయే విధంగా టమాటా దానంతో స్పెషల్ గా సెలబ్రేట్ చేశారు హైదరాబాద్ కి చెందిన ఓ తండ్రి.

దానాలన్నిటిలో టమాటా దానం గొప్పది..!
X

ఇటీవల అనకాపల్లిలో కూతురుకి టమాటాలతో తులాభారం వేశాడు ఓ తండ్రి. దాదాపు 50కేజీల టమాటాలను అమ్మవారి ఆలయానికి సమర్పించారు. హైదరాబాద్ లోని ఓ తండ్రి కూడా కూతురిపై ప్రేమను టమాటాలతో చాటుకున్నారు. అయితే ఈయన ఏకంగా 400కేజీల టమాటాలను పేదలకు పంచిపెట్టారు. కూతురు పుట్టినరోజు సందర్భంగా బస్తీ పేదలకు టమాటాలు పంచిపెట్టి వార్తల్లో వ్యక్తిగా మారారు పంజాగుట్ట ప్రతాప్ నగర్ కి చెందిన నల్లశివ. కూతురు పుట్టినరోజుని విభిన్నంగా చేశారు, ఎప్పటికీ గుర్తుంచుకునేలా సెలబ్రేట్ చేశారు.

టమాటాల రేటు ఆకాశాన్నంటి కిందకి దిగనంటున్న ఈరోజుల్లో టమాటాల గురించి ఏ చిన్న వార్త వచ్చినా అది వైరల్ గా మారిపోతోంది. అందుకే ఇలాంటి చిత్ర విచిత్ర దానాలన్నీ ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. కూతురు పుట్టినరోజుకి ఎవరైనా అన్నదానం చేస్తారు, అది సహజమే. అయితే కూతురికి ఆ పుట్టినరోజు ఎప్పటికీ గుర్తుండి పోయే విధంగా టమాటా దానంతో స్పెషల్ గా సెలబ్రేట్ చేశారు హైదరాబాద్ కి చెందిన నల్ల శివ. కేజీ 50రూపాయలకు ప్రభుత్వం సబ్సిడీపై ఇస్తోంది అంటేనే జనం ఎగబడుతున్నారు. ఇక ఉచితంగా ఇస్తున్నారంటే ఊరుకుంటారా..? ఆ పుట్టినరోజు వేడుకకు జనం పోటెత్తారు. ఎంచక్కా టమాటా ప్యాకెట్లు తీసుకుని వెళ్లిపోయారు.

చల్లగా ఉండాలి బిడ్డా..

అన్నిదానాల్లోకెల్లా అన్నదానం గొప్పది అనేది నానుడి. ఈరోజుల్లో దాన్ని టమాటా దానానికి అన్వయించుకోవాలేమో. అందుకే టమాటాలు దానంగా తీసుకున్న బస్తీ వాసులు చల్లగా ఉండాలి బిడ్డా అంటూ పుట్టినరోజు జరుపుకుంటున్న ఆ అమ్మాయిని మనసారా ఆశీర్వదించారు.

First Published:  20 July 2023 8:34 AM IST
Next Story