Telugu Global
Telangana

నేడే రాష్ట్ర బడ్జెట్‌

రూ. 3 లక్షల కోట్లకు పైగానే అంచనా..కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ ఇదే.

నేడే రాష్ట్ర బడ్జెట్‌
X

2025-26 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ వార్షిక బడ్జెట్‌ను ప్రభుత్వం శాసనసభ, మండలిలో ప్రవేశపెడుతున్నది. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క శానససభలో, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు మండలిలో ప్రవేశపెట్టనున్నారు.రాష్ట్ర బడ్జెట్‌ రూ. 3 లక్షల కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఉదయం 11 గంటలకు శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి ముందు మంత్రివర్గం సమావేశం కానున్నది. బడ్జెట్‌ ప్రతిపాదనలకు మంత్రి వర్గం ఆమోదం తెలుపనున్నది. గత సంవత్సర వార్షిక బడ్జెట్‌ రూ. 2జ9 లక్షల కోట్లు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ ఇదే.బడ్జెట్‌ ప్రతులతో శాసనసభకు చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్వాగతం పలికారు. అంతకుముందు ప్రజాభవన్‌లోని నల్లపోచమ్మ ఆలయంలో డిప్యూటీ సీఎం దంపతులు పూజలు చేశారు. అనంతరం అసెంబ్లీకి బయలుదేరారు.

First Published:  19 March 2025 10:00 AM IST
Next Story