Telugu Global
Telangana

ఈ రోజు మీ నీడ మాయం అవుతుంది.. నేడు హైదరాబాద్‌లో జీరో షాడో డే

ఈ రోజు సూర్యుడు హైదరాబాద్‌లో మన తల మీద నుంచి వెళ్లనున్నాడు. అందుకే నీడ మాయం అవుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్పారు.

ఈ రోజు మీ నీడ మాయం అవుతుంది.. నేడు హైదరాబాద్‌లో జీరో షాడో డే
X

హైదరాబాద్‌లో ఈ రోజు ఒక అద్భుతం ఆవిష్కృతం కానున్నది. మంగళవారం మన నీడ కాసేపు మాయం అవుతుంది. అరుదైన 'జీరో షాడో' డే ఇవ్వాళ హైదరాబాద్ వాసులకు కనువిందు చేయనున్నది. మధ్యాహ్నం 12.12 గంటల నుంచి 12.14 గంటల వరకు రెండు నిమిషాల పాటు నీడ మాయం అవుతుంది. ఆ సమయంలో సూర్య కిరణాలు నిట్టనిలువుగా పడటం వల్ల మన నీడ కనపడదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఆ సమయంలో ఎండలో మనుషులు నిలబడినా, ఏ వస్తువునైన నిటారుగా ఉంచినా.. దాని నీడ రెండు నిమిషాల పాటు కనిపించదని బిర్లా సైన్స్ సెంటర్ అధికారులు తెలిపారు. ఈ రోజు సూర్యుడు హైదరాబాద్‌లో మన తల మీద నుంచి వెళ్లనున్నాడు. అందుకే నీడ మాయం అవుతుందని చెప్పారు. భూమి గోళాకారంగా ఉండటం వల్ల సూర్య కిరణాలు సాధారణంగా మధ్యాహ్నం భూమధ్య రేఖపై మాత్రమే పడతాయి. దానికి ఉత్తర, దక్షిణ దిశల్లో నేరుగా పడవు.

అయితే సూర్యుని గమనం ఉత్తరాయణంలో 6 నెలలు ఉత్తర దిశగా, దక్షిణాయనంలో 6 నెలలు దక్షిణ దిశగా ఉంటుంది. ఈ సమయంలో సూర్యుడి వంపు దాదాపు 23.5 డిగ్రీలుగా ఉండటంతో భూమధ్య రేఖకు అన్ని డిగ్రీల ఉత్తరాన సూర్య కిరణాలు నిలువుగా పడతాయని అధికారులు చెప్పారు.


ఈ ఏడాది 23.5 డిగ్రీల వంపు అంటే.. మన హైదరాబాద్ నగరం మీదుగా కిరణాలు 90 డిగ్రీల నిలువుగా పడనున్నట్లు బిర్లా సైన్స్ సెంటర్ అధికారులు వెల్లడించారు. ప్రతీ ఏడాది ఉత్తరాయంలో ఒక సారి, దక్షిణాయంలో ఒక సారి చొప్పున సూర్య కిరణాలు నిలువుగా పడి జీరో షాడోను ఏర్పరుస్తాయని వారు వివరించారు.

First Published:  9 May 2023 6:59 AM IST
Next Story