మంచి నాయకుడిగా ఎదగాలంటే రిస్క్ చేయాలి : సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్ దేశంలోని నగరాలతో కాకుండా న్యూయార్క్, లండన్ పోటీ పడాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
ప్రతి ఒక్కరి జీవితంలో కష్టం లేకుండా గొప్ప విజయాలు సాధించలేమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో ఇవాళ ఐఎస్‌బీ లీడర్ షిప్ సమ్మిట్‌లోముఖ్యఅతిథిగా సీఎం హాజరయ్యారు. మంచి నాయకుడిగా ఎదగాలంటే ధైర్యం, త్యాగం ఉండాలని అన్నారు. ఐఎస్‌బీ విద్యార్థులు కొత్త ఇండియాకు అంబాసిడర్లు అని పేర్కొన్నారు. తెలంగాణను ట్రిలియన్ డాలర్లకు మార్చడమే తమ లక్ష్యం అన్నారు. హైదరాబాద్ ను 600 బిలియన్ డాలర్ల నగరంగా మార్చాలన్నారు. హైదరాబాద్ దేశంలోని నగరాలతో కాకుండా న్యూయార్క్, లండన్, పారిస్, టోక్యో, సియోల్ తో పోటీ పడాలని కోరుకుంటున్నట్టు సీఎం అన్నారు. తెలంగాణను ప్రపంచంలోని ప్రతీ భాగానికి తీసుకెళ్లడంలో మీ సహాయం కావాలి అన్నారు.
ఎక్కడికి వెళ్లినా హైదరాబాద్, తెలంగాణ గురించే మాట్లాడండి అని కోరారు. హైదరాబాద్ ను రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామని.. స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ వర్సిటీలు ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మీరంతా తెలంగాణలో 2, 3 ఏళ్లు పనిచేయాలి. మా ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల తరహాలో మంచి శాలరీలు ఇవ్వలేకపోవచ్చు. కానీ.. మంచి సవాళ్లు, జీవితానికి సరిపడా నాలెడ్జ్ అందిస్తుంది. దురదృష్టవశాత్తు ఒలింపిక్స్‌లో భారత్ స్వర్ణపతకాలు గెలవలేకపోయింది. అక్కడ అత్యధిక పతకాలు గెలవడమే లక్ష్యంగా పని చేస్తున్నాం. వ్యాపారాల్లో రాణిస్తున్న వారు ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు రావాలి’’అని రేవంత్ పిలుపునిచ్చారు.