కేటీఆర్‌ను కలిసిన తిరుమల చైర్మన్ బీఆర్ నాయుడు
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ని తిరుమల చైర్మన్ బీఆర్ నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు.
BY Vamshi Kotas20 Nov 2024 2:26 PM IST

X
Vamshi Kotas Updated On: 20 Nov 2024 4:31 PM IST
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ నందినగర్‌లో దాదాపు 30 నిమిషాలు సమావేశం అయ్యారు. తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాఫిక్‌గా మారింది. మాజీ మంత్రి కేటీఆర్‌కి వెంకటేశ్వర స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు టీటీడీ చైర్మన్.ఈ సందర్భంగా కేటీఆర్ గారు ఛైర్మన్ గారికి శాలువా కప్పి.. వెంకటేశ్వర స్వామి జ్ఞాపకను అందజేసారు. అలాగే కరీంనగర్‌లో, సిరిసిల్లలో గతంలో శంకుస్థాపన చేసిన టీటీడీ దేవాలయాల నిర్మాణాలు శరవేగంగా పూర్తయ్యేలా సహకరించాలని కేటీఆర్ కోరారు. తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఉన్నాయని, వాటి అభివృద్ధికి టీటీడీ తరఫున తోడ్పాటు అందించాలని కోరారు.
Next Story