తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్‌కు తిరుగులేదు..
ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే.. అధికార వైసీపీ లోక్‌సభ స్థానాలను దాదాపు క్లీన్‌స్వీప్ చేయడం ఖాయమని అంచనా వేసింది. వైసీపీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 24-25 ఎంపీ స్థానాలు గెలుచుకుంటుందని తెలిపింది.
తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్‌కు తిరుగులేదని తేల్చింది ప్రముఖ జాతీయ మీడియా సంస్థ టైమ్స్ నౌ. కేవలం లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి సర్వే వివరాలను మాత్రమే ఆ సంస్థ వెల్లడించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలే లీడ్‌లో ఉంటాయని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ మెజార్టీ స్థానాలను దక్కించుకుంటాయని అంచనా వేసింది.
2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలకే అత్యధిక స్థానాలు వస్తాయని టైమ్స్ నౌ సర్వే తేల్చింది. తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలుండగా.. కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ పార్టీ 9 నుంచి 11 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. బీజేపీకి రెండు నుంచి మూడు సీట్లు, కాంగ్రెస్ మూడు నుంచి నాలుగు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఇతరులు ఓ సీటు గెలుస్తారని స్పష్టం చేసింది. ఈ సర్వేను గత నెల సెప్టెంబర్‌లో నిర్వహించినట్లు సమాచారం. డిసెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టైమ్స్ నౌ విడుదల చేసిన సర్వే ఫలితాలు అధికార పార్టీలో జోష్ నింపాయి.
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే.. అధికార వైసీపీ లోక్‌సభ స్థానాలను దాదాపు క్లీన్‌స్వీప్ చేయడం ఖాయమని అంచనా వేసింది. వైసీపీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 24-25 ఎంపీ స్థానాలు గెలుచుకుంటుందని తెలిపింది. ఇక తెలుగుదేశం పార్టీ సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతుందని తేల్చింది. ఆ పార్టీకి ఒక ఎంపీ స్థానం దక్కే అవకాశం ఉందని సర్వేలో వెల్లడించింది. ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో జరగనున్నాయి. దీంతో ఏపీలో వార్ వన్ సైడేనని సర్వే తేల్చిందంటున్నారు వైసీపీ అభిమానులు.