Telugu Global
Telangana

తుమ్మల ఎందుకు యాక్టివ్ అయ్యారు? హామీ లభించిందా?

మంత్రి హరీష్ రావు జిల్లా పర్యటనలో భాగంగా ఇంటికెళ్ళి తుమ్మలతో భేటీ అయ్యారు. అక్కడి నుండే కేసీఆర్‌తో మాట్లాడించినట్లు సమాచారం. దాంతో సీన్ మొత్తం మారిపోయింది.

తుమ్మల ఎందుకు యాక్టివ్ అయ్యారు? హామీ లభించిందా?
X

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక్కసారిగా యాక్టివ్ అయిపోయారు. చాలాకాలంగా కేసీఆర్‌కు దూరంగా ఉంటున్న తుమ్మల ఎందుకని ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు? 18వ తేదీన ఖమ్మంలో జరగబోతున్న బహిరంగ సభను గ్రాండ్ సక్సెస్ చేయించాలని మాజీ మంత్రి జిల్లా అంతా పర్యటనలు చేస్తున్నారు.

కేసీఆర్‌తో వచ్చిన గ్యాప్ కారణంగానే పార్టీతో చాలాకాలంగా తుమ్మల అంటీముట్టనట్లుగా ఉంటున్నారని అందరికీ తెలిసిందే. కాంగ్రెస్, బీజేపీల్లో చేరాలని మద్దతుదారులు తుమ్మలపైన ఒత్తిడి కూడా తెస్తున్నారు.

ఏదోరోజు పార్టీ నుండి తుమ్మల బయటకు వెళ్ళిపోవటం ఖాయమవ్వటంతో కాంగ్రెస్, బీజేపీ సీనియర్ నేతలు కూడా తుమ్మలతో భేటీలు జరిపారు. ఏదో పార్టీలో చేరాలా? లేదా ఇండిపెండెంటుగా పోటీ చేయాలా? అనే విషయంలో మద్దతుదారుల అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే మంత్రి హరీష్ రావు జిల్లాలో పర్యటించారు. తన పర్యటనలో భాగంగా ఇంటికెళ్ళి తుమ్మలతో భేటీ అయ్యారు. అక్కడి నుండే కేసీఆర్‌తో మాట్లాడించినట్లు సమాచారం. దాంతో సీన్ మొత్తం మారిపోయింది. అలకను వదిలేశారు, గ్యాప్ మాయమైపోయింది దాంతో ఒక్కసారిగా యాక్టివ్ అయిపోయారు.

అసలు ఈ మొత్తానికి కారణం ఏమిటంటే పాలేరు నుండి పోటీ చేయటానికి తుమ్మల రెడీ అయ్యారు. అయితే టికెట్ దక్కేది అనుమానంగా మారింది. ఎందుకంటే కాంగ్రెస్ తరపున గెలిచి బీఆర్ఎస్‌లో చేరిన కందాళం ఉపేంద్రకే కేసీఆర్‌ సీటు ఖాయం చేశారు. పాలేరు కాకుండా పోటీ చేయానికి తుమ్మలకు ఇక సీటేలేదు. విషయం తేల్చుకుందామని ప్రయత్నిస్తే కేసీఆర్ అవకాశం ఇవ్వలేదు.

కేసీఆర్ దగ్గర ఎంట్రీ లేకపోవటంతో లాభం లేదని అనుకుని పార్టీ మారాలా లేకపోతే ఇండిపెండెంటుగా పోటీ చేయాలా అనే కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈ నేపధ్యంలోనే హరీష్ రాయబారం ఫలించినట్లుంది. అంటే పాలేరులో తుమ్మలకు టికెట్ ఇవ్వటానికి కేసీఆర్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేన‌ని, ఇదే సమయంలో ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకుంటానని కేసీఆర్‌ హామీ ఇచ్చినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.

ఏదో ఒక స్పష్టమైన హామీ దక్కకపోతే తుమ్మల యాక్టివ్ అయ్యే అవకాశంలేదు. మొదటి ప్రచారమే నిజమైతే మరి ఇప్పటికే ప్రచారం చేసుకుంటున్న సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పరిస్ధితి ఏమిటి? ఉపేంద్ర ఏం చేస్తారు? అనేది సస్పెన్సుగా మారింది. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

First Published:  17 Jan 2023 12:05 PM IST
Next Story