మూడు పార్టీలు మారి ముఖ్యమంత్రి అయ్యావు : ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి మండిపడ్డారు.

సీఎం రేవంత్‌రెడ్డిపై ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు పార్టీలు మరి ఢిల్లీకి కప్పం కట్టి ముఖ్యమంత్రి కుర్చీ తెచ్చుకున్నాడని రేవంత్‌రెడ్డిని ఆయన మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా ఉన్న కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్ రాసిన లేఖ దిక్కుమాలినదిగా అభివర్ణించారు. కిషన్‌రెడ్డిడ్డిని విమర్శించే నైతిక హక్కు రేవంత్ కు లేదని ఫైర్‌య్యారు. బీజేపీ సాధారణ కార్యకర్తగా ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్రమంత్రిగా నిజాయితీతో పనిచేసిన మచ్చలేని వ్యక్తి కిషన్ రెడ్డి అని రాకేశ్‌రెడ్డి అన్నారు . వచ్చే ఎన్నికల నాటికి రేవంత్ ఏ పార్టీలో ఉంటాడో ఎవరికి తెలీదన్నారు.
రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతామన్నారు. రాబార్ట్ వాద్రా కోసం మూసీ ప్రాజెక్టు చెపడితే మేమేందుకు నిధులు ఇస్తాం.అవినీతి ప్రాజెక్టులు తప్పా ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చడం లేదు. తెలంగాణ నిధులు ఇచ్చి ఆదుకుంటున్నది కేంద్రప్రభుత్వమే. ఆయనతో ఉన్న ఎమ్మెల్యేలే ఆయన్ను పట్టించుకోవడం లేదన్నారు. ఎనుముల బ్రదర్స్ కమీషన్ కోసమే ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్ మార్చాలని ఆయన ఆరోపించారు.పేద ప్రజల భూమి పోయేలా అలైన్మెంట్ మార్చాలని వెళ్తే కేంద్రం ఒప్పుకోలేదు. రేవంత్.. చేతకాని, చేవ లేని ముఖ్యమంత్రి. కనీసం కేబినెట్ కూడా విస్తరణ చేపట్టలేని స్థితిలో ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహించలేని స్థితిలో ఉన్నారు అని రాకేష్ రెడ్డి ధ్వజమెత్తారు