Telugu Global
Telangana

ఈ సారి తెలంగాణ బడ్జెట్‌లో ఆరోగ్యం, వైద్య రంగానికి ప్రాధాన్యం

తెలంగాణ వార్షిక ఆరోగ్య నివేదికను విడుదల చేసిన‌ హరీష్ మాట్లాడుతూ, గత ఏడాది కాలంలో సాధించిన విజయాలను కన్సాలిడేట్ చేసేందుకు బడ్జెట్‌లో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ‘‘తెలంగాణ ఆరోగ్య శాఖకు 2023 చాలా కీలకం. ఇప్పటి వరకు జరుగుతున్న అనేక అభివృద్ధి కార్యకలాపాలు ఈ సంవత్సరంలో పూర్తవుతాయి. ”అని ఆయన అన్నారు.

ఈ సారి తెలంగాణ బడ్జెట్‌లో ఆరోగ్యం, వైద్య రంగానికి ప్రాధాన్యం
X

రాబోయే 10-12 నెలల్లో హైదరాబాద్, వరంగల్‌లో తొమ్మిది కొత్త మెడికల్ కాలేజీలు, ఐదు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులతో సహా తెలంగాణ ప్రభుత్వం రాబోయే బడ్జెట్‌లో ఆరోగ్యం, వైద్య మౌలిక సదుపాయాలపై ప్రధాన దృష్టి కేంద్రీకరిస్తుందని ఆరోగ్య మంత్రి టీ హరీశ్‌రావు తెలిపారు.

తెలంగాణ వార్షిక ఆరోగ్య నివేదికను విడుదల చేసిన‌ హరీష్ మాట్లాడుతూ, గత ఏడాది కాలంలో సాధించిన విజయాలను కన్సాలిడేట్ చేసేందుకు బడ్జెట్‌లో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ‘‘తెలంగాణ ఆరోగ్య శాఖకు 2023 చాలా కీలకం. ఇప్పటి వరకు జరుగుతున్న అనేక అభివృద్ధి కార్యకలాపాలు ఈ సంవత్సరంలో పూర్తవుతాయి. ”అని ఆయన అన్నారు.

మరో వారం నుంచి 10 రోజుల్లో తెలంగాణలో మొత్తం 1,147 మంది అసోసియేట్ ప్రొఫెసర్‌లకు ప్రొఫెసర్‌లుగా పదోన్నతి కల్పించి, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, కుమురంభీం ఆసిఫాబాద్‌, జనగాం, నిర్మల్ ల‌ లోని తొమ్మిది కొత్త మెడికల్ కాలేజీలకు పోస్టింగ్ ఇవ్వనున్నారు అని హరీశ్‌ తెలిపారు.

మెడికల్ కాలేజీలతో పాటు మరో 10-12 నెలల్లో నిమ్స్, వరంగల్‌లోని హెల్త్ సిటీ, హైదరాబాద్‌లోని నాలుగు స్పెషాలిటీ ఆసుపత్రుల విస్తరణతో సహా ఆరు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు పూర్తవుతాయి. దాదాపు 9,000 సూపర్ స్పెషాలిటీ పడకలను అందజేస్తున్నాము. ఈ ఆసుపత్రులకు సంబంధించిన పనులు షెడ్యూల్ ప్రకారం జరుగుతున్నాయి’’ అని హరీశ్ తెలిపారు.

హైదరాబాద్‌లోని ప్రభుత్వ తృతీయ శ్రేణి ఆసుపత్రుల్లో కూడా రాబోయే నెలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడనున్నాయి. MNJ క్యాన్సర్ ఆసుపత్రిలో 300 పడకల కొత్త బ్లాక్, కోటి ENT ఆసుపత్రిలో కొత్త బ్లాక్, సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో ప్రధాన మౌలిక సదుపాయాల నవీకరణ రాబోయే నెలల్లో చేపట్టనున్నట్లు హరీశ్ రావు తెలిపారు.

ఈ సందర్భంగా హరీశ్ రావు కాంగ్రెస్, బిజెపి నేతృత్వంలోని రాష్ట్రాలపై విరుచుకుపడ్డారు. “ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటకతో సహా బిజెపి నేతృత్వంలోని అన్ని రాష్ట్రాలు, కాంగ్రెస్ నేతృత్వంలోని ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలు తెలంగాణను చూసి నేర్చుకోవాలి. BRS ప్రభుత్వం ఈ వార్షిక ఆరోగ్య నివేదికను ఆయా రాష్ట్రాలకు అందిస్తే దాన్ని చూసి వాళ్ళు ఏదైనా నేర్చుకోవచ్చు, ”అని హరీష్ అన్నారు.

First Published:  30 Jan 2023 2:05 AM GMT
Next Story