Telugu Global
Telangana

కదనరంగంలోకి కేసీఆర్.. షెడ్యూల్ ఇదే!

ఈనెల 15న హుస్నాబాద్‌ నుంచి కేసీఆర్‌ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. నవంబర్‌ 9న గజ్వేల్‌, కామారెడ్డిలో నామినేషన్ వేస్తారు. తర్వాత కామారెడ్డిలో నిర్వహించే బహిరంగసభలో పాల్గొంటారు.

కదనరంగంలోకి కేసీఆర్.. షెడ్యూల్ ఇదే!
X

అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అధికార బీఆర్ఎస్‌ పార్టీ దూకుడు పెంచింది. ఇప్పటికే మంత్రులు కేటీఆర్, హరీష్‌ రావు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తుండగా.. గులాబీ బాస్‌ కేసీఆర్‌ కూడా కదనరంగంలోకి అడుగుపెట్టనున్నారు. ఈనెల 15 నుంచి నవంబర్‌ 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో KCR పాల్గొంటారు. ఈ మేరకు కేసీఆర్‌ సభల షెడ్యూల్‌ను బీఆర్ఎస్ విడుదల చేసింది. రోజుకు రెండు, మూడు నియోజకవర్గాల చొప్పున మొత్తం 41 నియోజకవర్గాలను చుట్టేయనున్నారు కేసీఆర్. ఈనెల 15న హుస్నాబాద్‌ నుంచి కేసీఆర్‌ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. నవంబర్‌ 9న గజ్వేల్‌, కామారెడ్డిలో నామినేషన్ వేస్తారు. తర్వాత కామారెడ్డిలో నిర్వహించే బహిరంగసభలో పాల్గొంటారు.

కేసీఆర్‌ బహిరంగ సభల షెడ్యూలు ఇదే

అక్టోబర్‌ 16న జనగామ, భువనగిరి

అక్టోబర్ 17- సిరిసిల్ల, సిద్దిపేట

అక్టోబర్ 18-జడ్చర్ల, మేడ్చల్‌

అక్టోబర్ 26-అచ్చంపేట, నాగర్‌కర్నూల్‌, మునుగోడు

అక్టోబర్ 27-పాలేరు,స్టేషన్‌ఘన్‌పూర్‌

అక్టోబర్ 29-కోదాడ, తుంగతుర్తి, ఆలేరు

అక్టోబర్ 30- జుక్కల్‌, బాన్సువాడ, నారాయణఖేడ్‌

అక్టోబర్ 31- హుజూర్‌నగర్‌, మిర్యాలగూడ, దేవరకొండ

నవంబర్‌ 1- సత్తుపల్లి, ఇల్లందు

నవంబర్‌2-నిర్మల్‌, బాల్కొండ, ధర్మపురి

నవంబర్‌3- భైంసా, ఆర్మూర్‌, కోరుట్ల

నవంబర్‌5- కొత్తగూడెం, ఖమ్మం

నవంబర్‌6- గద్వాల్‌, మక్తల్‌, నారాయణపేట

నవంబర్‌7- చెన్నూరు, మంథని, పెద్దపల్లి

నవంబర్‌8- సిర్పూర్‌, ఆసిఫాబాద్‌, బెల్లంపల్లి

నవంబర్‌9- కామారెడ్డి

First Published:  11 Oct 2023 2:28 AM GMT
Next Story