Telugu Global
Telangana

కాంగ్రెస్‌ ఫైనల్ లిస్ట్ ఇదే.. పటేల్‌, అద్దంకికి షాక్‌..!

పటేల్ రమేష్ రెడ్డి, అద్దంకి దయాకర్‌కు షాకిచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. సూర్యాపేట టికెట్‌ కోసం దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి మధ్య తీవ్ర పోరు నడిచింది.

కాంగ్రెస్‌ ఫైనల్ లిస్ట్ ఇదే.. పటేల్‌, అద్దంకికి షాక్‌..!
X

నామినేషన్ల స్వీకరణకు మరికొన్ని గంటలు మాత్రమే గడువు ఉండటంతో..పెండింగ్‌లో ఉన్న నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. ఓ స్థానంలో అభ్యర్థిని మార్చింది. చార్మినార్ స్థానం నుంచి మహ్మద్‌ ముజీబ్‌ ఉల్లా షరీఫ్‌ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. మిర్యాలగూడ స్థానాన్ని బత్తుల లక్ష్మారెడ్డి, సూర్యాపేట టికెట్‌ను సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డికి కేటాయించింది.

ఇక గత లిస్ట్‌లో పటాన్‌చెరు టికెట్‌ను దక్కించుకున్న నీలం మధు ముదిరాజ్‌కు..తాజా లిస్ట్‌లో షాక్ ఇచ్చింది హస్తం పార్టీ. ఆయన స్థానంలో కాటా శ్రీనివాస్‌ గౌడ్‌కు టికెట్ ఇచ్చినట్లు ప్రకటించింది. మరోవైపు శ్రీనివాస్ గౌడ్ భార్య సుధా శ్రీనివాస్ గౌడ్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.

ఇక పటేల్ రమేష్ రెడ్డి, అద్దంకి దయాకర్‌కు షాకిచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. సూర్యాపేట టికెట్‌ కోసం దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి మధ్య తీవ్ర పోరు నడిచింది. రేవంత్ అనుచరుడిగా ఉన్న పటేల్ చివరివరకు ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ ఆయనకు నిరాశే ఎదురైంది. ఇక తుంగతుర్తి టికెట్‌ తనకే వస్తుందని ధీమాతో ఉన్న అద్దంకికి మొండిచేయి చూపింది కాంగ్రెస్ అధిష్టానం. తుంగతుర్తి నుంచి మందుల శామ్యూల్‌కు అవకాశం ఇచ్చింది.

First Published:  10 Nov 2023 8:18 AM IST
Next Story