Telugu Global
Telangana

సిన్మాల్లో హైదరాబాద్ ను చూపిస్తూ బెంగళూరు అని చెప్తున్నారు - కేటీఆర్

హైదరాబాద్ లో ఇప్పుడు చూస్తున్న అభివృద్ది టీజర్ మాత్రమే అని సినిమా ముందుందన్నారు కేటీఆర్ . దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జి నిర్మించాక ఇక్కడికి టూరిస్టులు పెద్ద ఎత్తున వస్తున్నారని, ఈ మధ్య‌కాలంలో కేబుల్ బ్రిడ్జి వద్ద జరగని సినిమా షూటింగ్ లేదని కేటీఆర్ అన్నారు.

సిన్మాల్లో హైదరాబాద్ ను చూపిస్తూ బెంగళూరు అని చెప్తున్నారు - కేటీఆర్
X

దేశంలోని అన్ని నగరాల్లోకి హైదరాబాద్ నగర అభివృద్ది అతివేగంగా సాగుతున్నదని తెలంగాణ ఐటీ, పరిశ్ర‌మల శాఖా మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లో సినిమా షూటింగులు చేసి అది బెంగళూరు అని చూపిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ నిధులతో కార్పోరేట్ కంపెనీలు, GHMC పరిధిలోని 25, HMDA పరిధిలోని 25 చెరువుల అభివృద్ధికి చేయూతనిచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న వివిధ నిర్మాణ రంగ సంస్థ‌ల ప్ర‌తినిధుల‌కు ఒప్పంద ప‌త్రాల‌ను కేటీఆర్ అందించిన సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ,

హైదరాబాద్ లో ఇప్పుడు చూస్తున్న అభివృద్ది టీజర్ మాత్రమే అని సినిమా ముందుందన్నారు. దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జి నిర్మించాక ఇక్కడికి టూరిస్టులు పెద్ద ఎత్తున వస్తున్నారని, ఈ మధ్య‌కాలంలో కేబుల్ బ్రిడ్జి వద్ద జరగని సినిమా షూటింగ్ లేదని కేటీఆర్ అన్నారు.

''ఖాజాగూడ్ లేక్ ప‌క్క‌నే డెవ‌ల‌ప్ చేసిన లింక్ రోడ్డుపై కూడా చాలా సినిమా షూటింగ్‌లు చేస్తున్నారు. ఓ మ‌ల‌యాళం సినిమాలో పృథ్వీరాజ్ లీడ్ క్యారెక్ట‌ర్. ఇదే రోడ్డుమీద ఆ సినిమా షూటింగ్ చేసి దాన్ని బెంగళూరుగా చూపెట్టారు. అది చూసి నాకు చాలా కోపమొచ్చింది. నేను దీనిపై స్పందింద్దామనుకునే లోపే హైదరాబాద్ కు చెందిన ఓ మహిళా జర్నలిస్టు స్పందించారు. మా హైద‌రాబాద్‌లో షూటింగ్ చేసి.. బెంగ‌ళూరు అని చెప్ప‌డం ఇదేక్క‌డి అన్యాయం అని ప్ర‌శ్నించింది. అది చూసి నేను చాలా ఆనందపడ్డాను. ఇది మా హైదరాబాద్ అని ప్రతి ఒక్కరూ ఓన్ చేసుకోవడం గొప్పగా ఉంది.'' అన్నారు కేటీఆర్

First Published:  28 March 2023 5:09 PM IST
Next Story