Telugu Global
Telangana

ఆరు గ్యారంటీలకు దరఖాస్తు.. ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి

రేషన్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్ తప్పనిసరిగా ప్రజా పాలన దరఖాస్తుకు జత చేయాల్సి ఉంటుంది. ఇక మిగతా పథకాలకు సంబంధించి వివరాలు అడిగారు. దీంతో దరఖాస్తు చేయాలంటే ఏయే డాక్యుమెంట్లు తీసుకెళ్లాలనేదానిపై ఆశావహుల్లో గందరగోళం నెలకొంది

ఆరు గ్యారంటీలకు దరఖాస్తు.. ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి
X

గురువారం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలకు దరఖాస్తులు స్వీకరించనున్న విషయం తెలిసిందే. మహాలక్ష్మి గ్యారంటీ కింద మహిళలకు నెలకు రూ.2500, ఉచిత సిలిండర్లు, రైతు భరోసా పథకం, ఇందిరమ్మ ఇండ్లు, తెలంగాణ గృహ జ్యోతి కింద 200 యూనిట్ల విద్యుత్, పెన్షన్లు లాంటి పథకాల కోసం ఆశావహుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు కోరుతోంది.

అయితే రేషన్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్ తప్పనిసరిగా ప్రజా పాలన దరఖాస్తుకు జత చేయాల్సి ఉంటుంది. ఇక మిగతా పథకాలకు సంబంధించి వివరాలు అడిగారు. దీంతో దరఖాస్తు చేయాలంటే ఏయే డాక్యుమెంట్లు తీసుకెళ్లాలనేదానిపై ఆశావహుల్లో గందరగోళం నెలకొంది

ఆరు గ్యారంటీలకు దరఖాస్తు చేయాలంటే ఇవి తప్పనిసరి

-- ఆధార్ కార్డు జిరాక్స్‌, రేషన్ కార్డు జిరాక్స్‌

-- ఫ్రీ సిలిండర్ కోసం గ్యాస్‌ బుక్‌

-- 200 యూనిట్లు ఫ్రీ కరెంట్‌ కోసం మీటర్ కనెక్షన్‌ నంబర్‌/కరెంటు బిల్లు

-- కొత్తగా వికలాంగుల పెన్షన్‌ కోసం సదరం సర్టిఫికెట్‌ తప్పనిసరి

-- రైతు భరోసాకు అప్లై చేయాలంటే పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్‌లు, సర్వే నంబర్ వివరాలు

-- వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ కార్డు తప్పనిసరి.

-- రేషన్ కార్డు లేని వారు అప్లికేషన్‌లో లేదు అని నమోదు చేయాల్సి ఉంటుంది.

First Published:  27 Dec 2023 4:18 PM GMT
Next Story