Telugu Global
Telangana

సబ్సిడీ సిలిండర్‌ ఎవరికి..? జనాల్లో ఎన్నో అనుమానాలు

సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ఎవరికిస్తారు?. అర్హుల ఎంపిక ఎలా జరిగింది?. అసలు ప్రభుత్వం నిర్ణయించిన ఆ 40 లక్షల మంది లబ్ధిదారులు ఎవరు?. ఏ ప్రాతిపదికన అర్హులను ఎంపిక చేశారు?. అనేది ప్రశ్నార్థకంగా మారింది.

సబ్సిడీ సిలిండర్‌ ఎవరికి..? జనాల్లో ఎన్నో అనుమానాలు
X

రేపటి నుంచి 500 రూపాయలకు సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేయబోతోంది రేవంత్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో జనాల్లో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రంలో 90 లక్షలకు పైగా తెల్ల రేషన్‌కార్డులు ఉన్నాయి. కానీ, ప్రభుత్వం మాత్రం 40 లక్షల మందినే సబ్సిడీ గ్యాస్‌ పథకానికి అర్హులని తెలిపింది. 90 లక్షలకు పైగా వైట్ రేషన్‌ కార్డులుంటే 40 లక్షల కుటుంబాలను మాత్రమే సబ్సిడీ గ్యాస్‌ పథకానికి ఎంపిక చేయడంపై విమర్శలు వస్తున్నాయి. మిగతా వాళ్ల పరిస్థితి ఏంటి?. అసలు ప్రజాపాలనలో సబ్సిడీ గ్యాస్‌ కోసం ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు?. వాటిలో ప్రభుత్వం ఎన్ని దరఖాస్తుల్ని తొలగించింది?. అనే దానిపై దరఖాస్తుదారులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దీంతో తమకు 500 రూపాయలకు గ్యాస్ వస్తుందా లేదా అన్న ఆందోళన జనాల్లో ఎక్కువైంది.

ఇక ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తయింది. ఇవాళ గ్యాస్‌ కంపెనీల చేతికి అర్హుల జాబితా అందనుంది. ఈ నేపథ్యంలో సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ఎవరికిస్తారు?. అర్హుల ఎంపిక ఎలా జరిగింది?. అసలు ప్రభుత్వం నిర్ణయించిన ఆ 40 లక్షల మంది లబ్ధిదారులు ఎవరు?. ఏ ప్రాతిపదికన అర్హులను ఎంపిక చేశారు?. అనేది ప్రశ్నార్థకంగా మారింది.

మరోవైపు పథకానికి తొలి విడతగా రూ. 80 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం. అయితే ప్రభుత్వం విడుదల చేసిన నిధులకు అయ్యే ఖర్చుకు పొంతన లేని పరిస్థితి. 40 లక్షల మందికి ఒకసారి రీయింబర్స్‌ చేస్తే పడే భారమే 182 కోట్ల రూపాయలుగా ఉంది. అలాగే ఏటా 3 సిలిండర్లు ఇస్తే అది రూ.546 కోట్లకు పెరుగుతోంది. కానీ, ప్రభుత్వం మాత్రం కేవలం రూ.80 కోట్ల నిధులే విడుదల చేయడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

First Published:  26 Feb 2024 11:12 AM IST
Next Story