Telugu Global
Telangana

మెదక్ లో ఖాళీ కుర్చీలనుద్దేశించి ప్రసగించిన కేంద్రమంత్రి

మెదక్ జిల్లా నర్సాపూర్ లో నిన్న జరిగిన బీజేపీ సభలో బండి సంజయ్ మాట్లాడుతుండగానే జనం వెళ్ళిపోయారు. దాంతో ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ఖాళీ కుర్చీలతో మాట్లాడాల్సి వచ్చింది.

మెదక్ లో ఖాళీ కుర్చీలనుద్దేశించి ప్రసగించిన కేంద్రమంత్రి
X

తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్న బీజేపీ, రాష్ట్రానికి రోజుకో కేంద్రమంత్రిని, బీజేపీ జాతీయ‌ నాయకులను రప్పిస్తోంది. ఎక్కడో ఓ చోట సభలు నిర్వహిస్తోంది. ఆ సభలకు జనాలను తరలించడం కోసం బాగానే నిధులను ఖర్చుపెడుతోంది. అయినా అనేక చోట్ల ప్రజల నుంచి జాతీయ నాయకులకు అవమానాలు ఎదురవుతూనే ఉన్నాయి.

ఆదివారంనాడు మెదక్ జిల్లా నర్సాపూర్ లో బీజెపి ఓ సభ ఏర్పాటు చేసింది. ఆ సభకు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. బాగానే డబ్బులు ఖర్చు చేసి జనాలను రప్పించారు. అక్కడి దాకా బాగానే సాగింది. అయితే సభ ప్రారంభంకాగానే జనాలు ఎందుకో ఒక్క సారిగా లేచి వెళ్ళిపోయారు.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు టీఆరెస్ పార్టీ బహిష్కరించిన మురళీ యాదవ్ అనే వ్యక్తి బీజేపీలో చేరిక సందర్భంగా ఏర్పాటు చేసిన సభ ఇది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతుండగానే జనాలు లేచి వెళ్ళిపోవడం మొదలు పెట్టారు. ఆయన ప్రసంగం పూర్తయ్యే సరికి సభాస్థలం ఖాళీ అయ్యింది. ఇక చివరగా మాట్లాడిన కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ఖాళీ కుర్చీలతో మాట్లాడాల్సి వచ్చింది. ప్రజలు వెళ్ళకుండా ఆపడానికి బీజేపీ నాయకులు ఎంత ప్రయత్నించినా వాళ్ళు వినలేదు.

ఈ పరిస్థితి చూసి కేంద్రమంత్రి స్థానిక నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.

First Published:  10 Oct 2022 5:38 AM GMT
Next Story