రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పును తప్పుబట్టిన టీడీపీ ఎమ్మెల్యే
క్రైస్తవ మతంలోకి మారిన వారికి రిజర్వేషన్లు వర్తించవు అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తప్పుబట్టినారు.
సుప్రీంకోర్టు తీర్పుపై తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు షాకింగ్ కామెంట్స్ చేశారు. క్రైస్తవ మతంలోకి మారిన వారికి రిజర్వేషన్లు వర్తించవు అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఎమ్మెల్యే తప్పుపట్టారు. సెమీ క్రిస్మస్ సంబరాల్లో ఆయన మాట్లాడుతూ.. ‘వెనుకబడిన కులాలకు అంబేద్కర్ రిజర్వేషన్లు ఇచ్చారు. అయితే సుప్రీంకోర్టు క్రిస్టియన్లకు రిజర్వేషన్లు ఉండవని చెప్పిందని తెలిపారు. ఇదొక దారుణమైన అన్యాయమైన తీర్పు అన్నారు.
రాజ్యాంగం కులాలకు రిజర్వేషన్లు ఇస్తే మతానికి ముడిపెట్టడం తప్పు’ అని కొలికపూడి శ్రీనివాసరావు చెప్పారు. మత మార్పిళ్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మతంపై విశ్వాసం లేకుండా కేవలం రిజర్వేషన్ ప్రయోజనాలను పొందేందుకు మత మార్పిడికి పాల్పడడం రాజ్యాంగాన్ని మోసం చేయడమే అవుతుందని సుప్రీం కోర్టు పేర్కొంది. క్రైస్తవ మతానికి చెందిన ఓ మహిళకు షెడ్యూల్డ్ కుల ధ్రువీకరణ పత్రాన్ని నిరాకరిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.