Telugu Global
Telangana

పంట పెట్టుబడి సాయం ఇవ్వలేని దుస్థితిలో రేవంత్‌ ప్రభుత్వం

పంటలు కోతకు వచ్చినా రేవంత్‌ ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇవ్వకపోవడంపై ధ్వజమెత్తిన మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి

పంట పెట్టుబడి సాయం ఇవ్వలేని దుస్థితిలో రేవంత్‌ ప్రభుత్వం
X

పంటలు కోతకు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇవ్వలేదని, రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వలేని దురావస్థకు రేవంత్‌రెడ్డి సర్కార్‌ వచ్చిందని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డికి ఎవరైనా చెబితే వినే స్వభావం లేదు. రైతుల మేలు కోసం సూచనలు తీసుకుందామనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. వరంగల్‌ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ నెరవేర్చిందా? అని ప్రశ్నించారు.

గుజరాత్‌లో ఫసల్‌బీమా యోజనను అమలు చేయలేదు. ఫసల్‌ బీమా యోజన గొప్పదైతే గుజరాత్‌లో ఎందుకు అమలు చేయలేదని నిరంజన్‌ నిలదీశారు.కూలీ రైతులకు ఎకరాకు రూ. 15 వేలు ఇస్తామని కాంగ్రెస్‌ గతంలో హామీ ఇచ్చింది. ప్రస్తుతం వారికి ఇవ్వలేమని ప్రభుత్వం చేతులెత్తేసింది. ఏపీ కౌలుదారీ చట్టంతో పోలిస్తే మన చట్టం వేరు. ఏపీ కౌలుదారీ విధానాన్ని తెలంగాణలో వర్తించడమే కాంగ్రెస్‌ విధానమని మాజీ మంత్రి మండిపడ్డారు. తలసరి భూవిస్తీర్ణం ఆంధ్రతో పోలిస్తే తెలంగాణలో ఎక్కువ. రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలకు అంతేలేకుండా పోయింది.

First Published:  21 Sept 2024 7:58 AM GMT
Next Story