Telugu Global
Telangana

అసలు ఆట ఇప్పుడే మొదలైంది.. కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ హెచ్చరిక

అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్న రాహుల్ గాంధీ ఇప్పుడు ఎక్కడున్నార‌ని ప్రశ్నించారు కేటీఆర్. మొదటి మంత్రివర్గంలోనే 6 గ్యారంటీలకు చట్టబద్దత తెస్తామన్న హామీ ఏమైందని నిల‌దీశారు.

అసలు ఆట ఇప్పుడే మొదలైంది.. కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ హెచ్చరిక
X

అసలు ఆట ఇప్పుడే మొదలైందంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరికలు పంపారు మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సాధ్యం కాని హామీలిచ్చి ప్రజలను కాంగ్రెస్ మభ్యపెట్టిందని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారో ఇప్పుడు చూస్తామన్నారు. అసెంబ్లీలో మీడియాతో చిట్‌ చాట్ నిర్వ‌హించిన కేటీఆర్‌.. కాంగ్రెస్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు.

అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్న రాహుల్ గాంధీ ఇప్పుడు ఎక్కడున్నార‌ని ప్రశ్నించారు కేటీఆర్. మొదటి మంత్రివర్గంలోనే 6 గ్యారంటీలకు చట్టబద్దత తెస్తామన్న హామీ ఏమైందని నిల‌దీశారు. మొన్నటివరకు అధికారంలో ఉన్న BRS ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన కాంగ్రెస్‌ పార్టీకి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు కేటీఆర్.

"హామీలివ్వడం కాదు వాటిని అమలు చేయడం ముఖ్యం. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ బరువు వాళ్లకు తెలియాలి. ఓ ఎమ్మెల్యే మా నియోజకవర్గంలో 45వేల ఉద్యోగాలిస్తామని చెప్తున్నాడు. ఎలా ఇస్తారు అంటే ఇస్తామని చెప్తున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏనాడూ పద్దు మీద చర్చ జరగలేదు. కానీ, మేము ఏటా పద్దులపై శ్వేత పత్రం విడుదల చేశాం. ప్రతి ఏడాది పీఏసీ, కాగ్ రిపోర్ట్స్ ఇచ్చాం. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి మాకు ఇచ్చారని కాంగ్రెస్ వాళ్లు చెప్తారు. రేపు గవర్నర్ ప్రసంగంలో ఇదే పాత చింతకాయ పచ్చడి చెప్పిస్తారు. ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి. వాటిని అమలు చేయించేంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిద్రపోనివ్వం" అంటూ అధికారపార్టీకి వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్.

First Published:  13 Dec 2023 2:47 PM IST
Next Story