ఎంఆర్‌పీఎస్ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు తీవ్ర ఉద్రిక్తత
హైదరాబాద్‌లోని పార్మీగుట్ట ఎంఆర్‌పీఎస్ జాతీయ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పార్మీగుట్ట నుండి ట్యాంక్‌బండ్ వరుకు చేపట్టిన ర్యాలీకి అనుమతి లేదంటు పోలీసులు అడ్డుకున్నారు.
హైదరాబాద్‌లోని పార్మీగుట్ట ఎంఆర్‌పీఎస్ జాతీయ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పార్మీగుట్ట నుండి ట్యాంక్‌బండ్ వరుకు చేపట్టిన ర్యాలీకి అనుమతి లేదంటు పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఎంఆర్‌పీఎస్ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వదం జరిగింది. ఎస్సీ వర్గీకరణ చేయకుండా డీఎస్సీ ఉద్యోగాలను భర్తీ చేయడంపై ఎంఆర్‌పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగతో పాటు నేతలు నిరసనకు దిగారు. 11 వేల మంది టీచర్లకు నియామక పత్రాలు అదించనున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా ఆగస్టు1న ఎస్సీ వర్గీకరణ తర్వాతే నియామకాలు చేపడతామని మాటిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మాటతప్పారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉద్యోగ నోటిఫికేషన్లలో వర్గీకరణ అమలు చేస్తూ ఆర్డినెన్స్ తెస్తామని ఆయన అసెంబ్లీలో చెప్పారని, కానీ ఇప్పుడు ఎలాంటి వర్గీకరణ ఆర్డినెన్స్ తీసుకురాకుండానే 11 వేల మంది టీచర్లకు నియామక పత్రాలు ఎలా అందజేస్తారని ప్రశ్నించారు. దీనివల్ల తమ మాదిగ సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని, మొత్తం 11 వేల పోస్టుల్లో ఎస్సీలకు1,650 పోస్టులు రావాల్సి ఉండగా, వాటిలో 1,100 పోస్టులు మాదిగ, మాదిగ ఉప కులాలకు రావాల్సి ఉందని, కానీ వర్గీకరణ చేపట్టకపోవడంతో కనీసం తమకు 600 పోస్టులు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఉన్న చట్టం ప్రకారం తమకు వర్గీకరణ జరగాలని, దానికి అనుగుణంగా ఉద్యోగాల్లో వాటా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు, అసెంబ్లీలకు విలువనివ్వకుండా రేవంత్ సర్కార్ డీఎస్సీ నియమాకాలు చేపట్టారని ఆయన అన్నారు. మాలలకి లబ్థి చేకురే విధంగా రేవంత్‌రెడ్డి వ్యవహిరింస్తున్నరని ఆయన అన్నారు. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తియ్యే వరుకు డీఎస్సీ ఉద్యోగాల నియమాకాలు వాయిదా వేయాలని కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.