Telugu Global
Telangana

ఆ అధికారిని వెంటనే సస్పెండ్‌ చేయాలి

సన్నాలు, దొడ్డు వడ్లకు వేర్వేరు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంపై మంత్రి పొంగులేటి అధికారులపై ఆగ్రహం

ఆ అధికారిని వెంటనే సస్పెండ్‌ చేయాలి
X

ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్‌ దంతాలపల్లి ప్రాథమిక వ్వవసాయ శాఖ ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్నిమంత్రి పరిశీలించారు. ధాన్యంలో తేమ శాతాన్ని పరిశీలించారు. సన్నాలు, దొడ్డు వడ్లకు వేర్వేరు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంపై మంత్రి అధికారులపై అగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారిని వెంటనే సస్పెండ్‌ చేయాలని ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు.

First Published:  7 Nov 2024 2:56 PM IST
Next Story