Telugu Global
Telangana

పత్తి రైతులను దగా చేస్తున్న ప్రభుత్వం

సీసీఏ ప్రకటించిన మద్దతు ప్రకారం కొనుగోలు చేయాలని బీఆర్‌ఎస్‌ నేతల డిమాండ్‌

పత్తి రైతులను దగా చేస్తున్న ప్రభుత్వం
X

ఖమ్మం పత్తి మార్కెట్‌ను బీఆర్‌ఎస్‌ నేతలు సందర్శించారు. మద్దతు ధరపై ఆరా తీశారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. పత్తి ధరలు రోజురోజుకు పడిపోతున్నదని, పెట్టిన పెట్టుబడికి తగిన మద్దతు ధర లభించడం లేదని, తేమ,నాణ్యత పేరుతో సీసీఏ, వ్యాపారులు కోత విధిస్తున్నారని కొన్నిరోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు భరోసా కల్పించడానికి బీఆర్ఎస్‌ నేతల తాతా మధుసూదన్, సండ్ర వెంకట వీరయ్య తదితరుల బృందం ఖమ్మం జిల్లా పత్తి మార్కెట్‌కు వెళ్లింది.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ.. పత్తికి సీసీఏ మద్దతు ధర రూ. 7,200 ప్రకటించింది. ఆ ధరకు కొనలేదని మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ చెప్పారని తెలిపారు. దీన్నిబట్టి పరిస్థితి ఎలా ఉన్నదో అర్థం చేసుకోవాలన్నారు. సీసీఏ రైతులకు ఉపయోగపడేలా లేదని, కమీషన్లు దండుకునేలా ఉన్నదని ఆరోపించారు. రూ. 6 వేలకు మించి మద్దతు ధర పలుకడం లేదన్నారు. రైతులు వాళ్లు ఏ రేటుకు అడిగితే ఆ ధరు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొన్నదన్నారు. పెట్టిన పెట్టుబడినైనా రాబట్టుకోవాలని రైతులు అనివార్యంగా అమ్ముకుంటున్నారు. అందుకే సీసీఏను మారెట్‌లోనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మార్కెట్‌లో కాకుండా జిన్నింగ్‌ మిల్లుల వద్ద కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల ఆ మిల్లుల యజమానులు చెప్పిన విధంగా కొంటున్నారని విమర్శించారు. ఫలితంగా పత్తి రైతుల మద్దతు ధర కోల్పోతున్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 9 చోట్ల పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కానీ ఎక్కడా ఏర్పాటు చేయలేదన్నారు. ఇప్పటివరకు ఎన్ని క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేశారో కూడా ప్రభుత్వం చెప్పడం లేదని సండ్ర ఫైర్‌ అయ్యారు.

First Published:  5 Nov 2024 4:59 AM GMT
Next Story