Telugu Global
Telangana

పోలీసులపై ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోంది

టీఎస్‌ఎల్పీ లీవ్‌ మ్యానువల్స్‌ మార్చి ఇబ్బంది పెడుతోంది : మాజీ మంత్రి హరీశ్‌ రావు

పోలీసులపై ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోంది
X

పోలీసుల విషయంలో ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందని, టీఎస్‌ ఎస్పీ కానిస్టేబుల్స్‌ లీవ్‌ మ్యానువల్‌ మార్చి వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని మాజీ మంత్రి హరీశ్‌ రావు ఆందోళన వ్యక్తం చేశారు. టీఎస్‌ ఎస్పీ పోలీస్‌ కానిస్టేబుల్స్‌ ప్రతి 15 రోజులకోసారి ఇంటికి వెళ్లేలా లీవ్‌ మ్యానువల్‌ ఉండగా, దానిని రేవంత్‌ ప్రభుత్వం నెలకు రోజులకు మార్చడం దుర్మార్గమన్నారు. టీఎస్‌ ఎస్పీ కానిస్టేబుల్స్‌ ఇంటికి వెళ్లేందుకు వారాల తరబడి ఎదురు చూసేలా చేయడమేనా వారికి మీరు ఇచ్చే దసరా, దీపావళి కానుక అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి దగ్గరే హోం శాఖ కూడా ఉందని, వెంటనే పాత లీవ్‌ మ్యానువల్‌ అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు సివిల్‌, ఏఆర్‌ తో పాటు ఇతర పోలీసులకు 15 రోజుల టీఏ ఇచ్చేదని, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని ఏడు రోజులకు కుదించిందన్నారు. పెండింగ్‌ లో ఉన్న టీఏ, ఎస్‌ఎల్‌, జీపీఎఫ్‌లు వెంటనే విడుదల చేయాలన్నారు. కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు ఇచ్చినట్టుగానే పోలీస్‌ స్టేషన్‌ల నిర్వహణకు నిధులు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా పోలీసుల సమస్యలపై స్పందించాలని సూచించారు.

First Published:  15 Oct 2024 2:19 PM IST
Next Story