పుడమి పులకరించే..సింగిడి రంగుల పూల వైభవం..!
సద్దుల బతుకమ్మ సందర్భంగా ఆడబిడ్డలందరికీ కేటీఆర్ విషెస్
తెలంగాణలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎనిమిది రోజుల పాటు ఒక్కో పేరుతో బతుకమ్మను పేర్చి ఆడపడుచులు ఆడిపాడారు. నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొననున్నారు. నేటితో తెలంగాణలో బతుకమ్మ సంబరాలు ముగియనున్నాయి. సద్దుల బతుకమ్మ సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మను పురస్కరించుకుని తెలంగాణ ఆడబిడ్డలకు విషెస్ చెప్పిన కేటీఆర్ చివరిరోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ సంస్కృతికి ప్రతీక మన బతుకమ్మ పండుగ అని కేటీఆర్ అన్నారు. పూలను, ప్రకృతిని దేవుళ్లుగా కొలుస్తూ ఆడబిడ్డలు ఆనందంగా జరుపుకునే అద్భుతమైన పండుగ. దేశంలో ఎక్కడాలేని అరుదైన, అరుదైన, అందమైన సంస్కృతి వారసత్వం మన బతుకమ్మ పండుగ అని గుర్తు చేసుకున్ఆరు. చిన్నా, పెద్దా అని తేడా లేకుండా ఆడబిడ్డలంతా ఎంతో సంతోషంగా ఈ ఘనమైన పండుగను జరుపుకుంటారని తెలిపారు. ఆడబిడ్డల జీవితాల్లో బతుకమ్మ తల్లి మరిన్ని సంతోషాలు, వెలుగు నింపాలని కోరుకుంటున్నానని తెలుపుతూ కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు
పుడమి పులకరించే..సింగిడి రంగుల పూల వైభవం..!
ప్రకృతి పరవశించే తీరొక్క వర్ణాల బతుకు సంబురం..!
పువ్వులు..నవ్వులు విరబూసే సహజీవన సౌందర్యం..!
ఇచ్చిపుచ్చుకునే వాయినాల ..అచ్చమైన ఆనంద పరిమళం..!
నిండిన చెరువుల నీటి అలలపై ఉయ్యాలలూగే గౌరమ్మలు..!
పండిన పచ్చని పంట చేనుల దారుల్లో పూల తేరులు..!
సమిష్టి సంస్కృతిని చాటిచెప్పే విశిష్ట వేడుక..!
స్త్రీల సృజనతో వెలిగే తెలంగాణ అస్తిత్వ ప్రతీక...!
ఆడబిడ్డలందరికి
సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు..! అని కేటీఆర్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.