Telugu Global
Telangana

బాధితులకు పరిహారం ఇచ్చాకే ఫ్లై ఓవర్‌ పనులు చేపట్టాలి

మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌

బాధితులకు పరిహారం ఇచ్చాకే ఫ్లై ఓవర్‌ పనులు చేపట్టాలి
X

జూబ్లీ బస్‌ స్టేషన్‌ నుంచి శామీర్‌పేట వరకు ఫ్లై ఓవర్‌ నిర్మించడానికి ముందే అక్కడ షాపులు, ఇండ్లు కోల్పోతున్న వారికి నష్టపరిహారం ఇవ్వాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ డిమాండ్ చేశారు. శుక్రవారం జరిగిన కంటోన్మెంట్‌ బోర్డు మీటింగ్‌ లో ఈ అంశాన్ని ఈటల లేవనెత్తారు. మీటింగ్‌ ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఫ్లై ఓవర్‌ కోసం 60 మీటర్ల వెడల్పుతో రోడ్డును ఆనుకుని ఉన్నవారిని తొలగించనున్నారని.. దీంతో వాళ్లు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. వారికి ముందుగా పరిహారం ఇవ్వాలని కోరారు. ఫ్లై ఓవర్‌ తో పాటు మెట్రో రైల్‌ నిర్మాణం చేపట్టే అవకాశం ఉంది కాబట్టి ఆధునిక పద్ధతిలో పనులు చేయాలని సూచించామన్నారు. దీనికోసం రూ.330 కోట్ల విలువైన కంటోన్మెంట్‌ భూములను సేకరిస్తున్నారని.. ఆ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గర కాకుండా కంటోన్మెంట్‌ బోర్డులోనే డిపాజిట్‌ చేసేలా తాము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పరిహారంతో కంటోన్మెంట్‌ ప్రాంతంలో అభివృద్ధి చేసేలా చూస్తామన్నారు. కంటోన్మెంట్‌ ఏరియాలోని ఆలయాలకు భక్తులు వెళ్లకుండా ఇబ్బంది పెడుతున్నారని, అలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆర్మీ ఉన్నతాధికారులను కోరానని తెలిపారు.

First Published:  8 Nov 2024 6:14 PM IST
Next Story