శబరిమల అయ్యప్ప దర్శనాలు మొదలు..భక్తుల సందడి
కేరళలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శబరిమలలో భక్తుల సందడి మొదలు కానుంది. శబరిమలలో అయ్యప్ప ఆలయ గర్భగుడి రెండు నెలల పాటు తెరవనున్నారు.
కేరళలోని శబరిమల క్షేత్రంలో అయ్యప్ప భక్తుల సందడి మొదలైంది. మండల-మకరవిళక్కు సీజన్‌లో భాగంగా ఇవాళ సాయంత్రం నుంచి భక్తుల దర్శనాలకు అనుమతిచ్చారు. తొలిరోజే వర్చువల్ బుకింగ్ ద్వారా దాదాపు 30 వేల మంది భక్తులు నమోదు చేసుకున్నట్లు సమాచారం. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఓ గంట ముందే (సాయంత్రం 4గంటలకు) ఆలయాన్ని తెరచినట్లు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. ఈ సీజన్‌లో దర్శన సమయాలను 18గంటలకు పొడిగించినట్లు పేర్కొన్నాది.
శనివారం తెల్లవారుజామున మూడు గంటలకు ఆలయ గర్భగుడిని ప్రధాన అర్చకుడు అరుణ్ కుమార్ నంబూథిరి తెరవనున్నట్లు దేవస్థానం బోర్డు పేర్కొంది.ఇప్పటికే అయ్యప్ప ఆలయ పరిసరాలు అయ్యప్ప కీర్తనలతో మారుమ్రోగుతుంది. వివిధ రాష్ట్రాలు, విదేశాల నుండి భక్తులు అయ్యప్ప స్వామివారికి దర్శించుకోవడానికి వస్తారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు తగిన సదుపాయాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. ఇప్పటికే ఆలయాన్ని సందర్శించేందుకు లక్షలాది మంది భక్తులు వర్చువల్ క్యూ సిస్టమ్‌లో తమ స్లాట్‌లను బుక్ చేసుకున్నారు.