బ్రిడ్జి రెయిలింగ్ పైకి దూసుకెళ్లిన పల్లె వెలుగు బస్సు
నేషల్ హైవే 161పై పల్లె వెలుగు బస్సు ప్రమాదానికి గురైంది. కన్సాన్‌పల్లిలో పల్లె వెలుగు బస్సు డివైడర్‌పైకి దూసుకెళ్లింది
BY Vamshi Kotas29 Nov 2024 3:16 PM IST

X
Vamshi Kotas Updated On: 29 Nov 2024 3:57 PM IST
సంగారెడ్డి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ఆందోల్ మండలం కన్సాల్ పల్లి గ్రామ శివారులో ఆర్టీసీ బస్సు డివైడర్‌పైకి దూసుకెళ్లింది. ప్రమాద జరిగిన సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 20 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. అయితే బస్సు బ్రిడ్జి రెయిలింగ్ పైకి ఎక్కి ఆగిపోవడంతో ప్రమాదం తప్పింది.
గాయపడిన ప్రయాణికులను జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అన్నారు. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన ప్రయాణికులను వేరే బస్సుల్లో వారి గమ్య స్థానాలకు చేర్చారు. నారాయణఖేడ్ డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సు నారాయణఖేడ్ నుంచి జోగిపెటకు వెళ్తుండగా.. కన్సాన్‌పల్లి గ్రామ శివారులో అదుపుతప్పి డివైడర్‌పైకి దూసుకెళ్లింది.
Next Story