Telugu Global
Telangana

మేము ఏం చేస్తున్నామో.. పథకాల లబ్ధిదారులకు తెలుసు

పలు నియోజకవర్గాల్లో ఉచిత విద్యుత్‌ కోసం ఖర్చు చేసిన లెక్కలు, రుణమాఫీ వివరాలు వెల్లడించిన డిప్యూటీ సీఎం

మేము ఏం చేస్తున్నామో.. పథకాల లబ్ధిదారులకు తెలుసు
X

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు నేడు మూడో రోజు కొనసాగుతున్నాయి. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రెండో రోజు కూడా చర్చ కొనసాగుతున్నది. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ సభ్యులు రుణమాఫీపై లేవనెత్తిన ప్రశ్నలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సభలో సభ్యులు గౌరవంగా మాట్లాడాలని సూచించారు. పథకాల కోసం ఖర్చు పెట్టిన ప్రతి పైసాపై లెక్కలు ఇస్తామన్నారు. మేము ఏం చేస్తున్నామో.. పథకాల లబ్ధిదారులకు తెలుసన్నారు. ప్రజల కోసం పనిచేస్తాం. మీలాంటి వారికోసం కాదన్నారు. పలు నియోజకవర్గాల్లో ఉచిత విద్యుత్‌ కోసం ఖర్చు చేసిన లెక్కలను డిప్యూటీ సీఎం వెల్లడించారు. ప్రభుత్వ పథకాలపై పెట్టిన ఖర్చులను సభ్యులకు తెలిపారు. అన్ని పథకాలకు సంబంధించిన వివరాలు తన వద్ద ఉన్నాయన్నారు. మేము పనులు చేస్తున్నాం కానీ ప్రచారం చేసుకోవట్లేదన్నారు. ప్రచారం చేసుకోకపోవడం వల్లనే కాంగ్రెస్‌ నష్టపోతున్నదని బైట వినికిడి అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ జరిగింది. ఈ సమచారం అన్ని నియోజకవర్గాల ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉన్నాయి. రుణమాఫీపై ఖాతాల వారీగా వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. రుణమాఫీపై కావాలనే తప్పు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వివిధ నియోజకవర్గాల్లో బీఆర్‌ ఎస్‌ హయాంలో జరిగిన రుణమాఫీ కాంగ్రెస్‌ చేసిన మాఫీ గురించి చెప్పారు.

పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. వాస్తవాలు మాట్లాడాలని సూచించారు. విద్యాశాఖ 11 వేల ఉద్యోగాలు ఇచ్చాం. 36 వేల మంది టీచర్లను బదిలీ చేశామన్నారు. 12 మంది వీసీలను నియమించామన్నారు. వందేళ్ల చరిత్ర ఉన్న ఉస్మానియా వర్సిటీకి తొలిసారి దళిత వీసీని నియమించాం. విద్యా సంస్థలు నడుపుతున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి సలహాలు ఇస్తారని ఆశించాం. విద్యాశాఖపై సమీక్షించడానికి ముఖ్యమంత్రికి సమయం అనడం సరికాదన్నారు. మహిళా వర్సిటీని మీరు ఎప్పుడైనా వెళ్లి చూశార? అని ప్రశ్నించారు. ఆ వర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టాం. యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలు న భూతో.. న భవిష్యత్‌ అని డిప్యూటీ సీఎం అన్నారు.

First Published:  15 March 2025 11:45 AM IST
Next Story