నిరుపేద విద్యార్థులను నాణ్యమైన విద్య అందించాలన్నదే లక్ష్యం
బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని బాలబాలికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
BY Raju Asari14 Nov 2024 11:32 AM IST
X
Raju Asari Updated On: 14 Nov 2024 11:37 AM IST
బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డి బాలబాలికలకు శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్రథమ ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ జయంతి ఆ మహనీయుడికి నివాళులు అర్పించారు. నేటి బాలబాలికలే భావిభారత పౌరులని విశ్వసించి ప్రజా ప్రభుత్వంలో వినూత్నమైన విద్యా మార్పులకు శ్రీకారం చుట్టిందని సీఎం పేర్కొన్నారు. బడుగు బలహీనవర్గాలకు విద్యను దూరం చేయరాదన్న చిత్తశుద్ధితోనే ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు. నిరుపేద విద్యార్థులను నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రతి నియోజకవర్గంలో ఏకీకృత గురకుల పాఠశాలలకు శ్రీకారం చుట్టినట్లు సీఎం స్పష్టం చేశారు.
Next Story