నా లక్ష్యం అదే.. జగిత్యాల సభలో కేసీఆర్ ఎమోషనల్..!
తెలంగాణ తెచ్చిన పేరే తనకు ఆకాశమంత పెద్దది అన్నారు. అంతకుమించిన పదవి లేదన్నారు. ఈ విషయం చాలా మందికి అర్థం కావడం లేదన్నారు కేసీఆర్.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రజా ఆశీర్వాద సభలతో ప్రజల్లోకి దూసుకెళ్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. నేడు జగిత్యాలలో నిర్వహించిన సభలో కాస్త భావోద్వేగానికి లోనయ్యారు. జీవితంలో తనకు ఇంకా ఏదో కావాలన్న కోరికలు లేవన్నారు. తన లక్ష్యమెంటో వివరించారు. తన తండ్లాట పదవి కోసం కాదన్నారు కేసీఆర్.
ఇంతకీ కేసీఆర్ ఏమన్నారంటే.. తెలంగాణ తెచ్చిన పేరే తనకు ఆకాశమంత పెద్దది అన్నారు. అంతకుమించిన పదవి లేదన్నారు. ఈ విషయం చాలా మందికి అర్థం కావడం లేదన్నారు కేసీఆర్. రెండు సార్లు ప్రజల మన్ననలతో పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశానన్నారు. వరుసగా పదేళ్లు సీఎంగా పనిచేసిన తెలుగు ముఖ్యమంత్రులు ఎవరు లేరన్నారు.
జగిత్యాలలో ఎమోషనల్గా మాట్లాడిన కేసీఆర్
— Telugu Scribe (@TeluguScribe) November 26, 2023
100 శాతం పేదరికం లేని తెలంగాణ చేయాలన్నదే నా లక్ష్యం - సీఎం కేసీఆర్ pic.twitter.com/gJUsoop5Uv
తను పోరాడేది పదవి కోసం కాదన్న కేసీఆర్.. కచ్చితంగా తెలంగాణ వందకు వంద శాతం పేదరికం లేని రాష్ట్రంగా మారాలన్నారు. కేరళ తరహాలో వంద శాతం అక్షరాస్యత సాధించాల్సిన అవసరం ఉందన్నారు. రైతాంగం గుండె మీద చేయి వేసుకుని పంటలు పండించే పరిస్థితి రావాలన్నారు. 70 సంవత్సరాల వయసు వచ్చిందన్న కేసీఆర్.. పార్టీల వైఖరి ఆలోచించి ఓటేయాలని పిలుపునిచ్చారు. ఆగం కావొద్దని ఓటర్లకు సూచించారు.