Telugu Global
Telangana

హైదరాబాద్ అంటే ఇదీ..!

హైద‌రాబాద్ అంటేనే వ‌ర‌ల్డ్ క్లాస్ సిటీ అని తన ట్వీట్ లో పేర్కొన్నారు కేటీఆర్. ఎవ‌రైనా స‌రే ఒప్పుకోక త‌ప్ప‌ని నిజం ఇదని చెప్పారు.

హైదరాబాద్ అంటే ఇదీ..!
X

దేశంలో అభివృద్ధి చెందిన నగరాల గురించి చెప్పుకోవాలంటే కచ్చితంగా హైదరాబాద్ ప్రస్తావన ఉండి తీరాలి. తెలంగాణ ఏర్పాటు తర్వాత హైదరాబాద్ లో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కొత్త కొత్త నిర్మాణాలు, మౌలిక వసతులు, హైదరాబాద్ కి వస్తున్న కార్పొరేట్ సంస్థలతో నగర రూపు రేఖలు మారిపోయాయి. దీంతో హైదరాబాద్.. టాక్ ఆఫ్ ది నేషన్ గా మారింది. భారత దేశ అభివృద్ధి గురించి ఎవరు ప్రస్తావించినా అందులో కచ్చితంగా హైదరాబాద్ కూడా ఉంటుంది. తాజాగా ఇదే విషయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ ఆసక్తికర ట్వీట్ వేశారు.


ఇండియన్ టెక్ గైడ్ అనే ట్విట్టర్ హ్యాండిల్ నుంచి తాజాగా ఓ ఆసక్తికర ట్వీట్ బయటకు వచ్చింది. సెమీ కండక్టర్ల తయారీలో భారత్ దూసుకుపోతోందని, దేశంలో 95 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు ఉన్నాయంటూ ఇండియన్ టెక్ గైడ్ పేర్కొంది. మూడింట రెండోవంతు బెంగళూరు, హైదరాబాద్ లో ఉన్నాయని తెలిపింది. ఆ ట్వీట్ లో వారు ఓ ఫొటోని రిఫరెన్స్ గా వాడారు. ఆ ఫొటో హైదరాబాద్ ది అంటూ కేటీఆర్ రిప్లై ఇచ్చారు.

హైద‌రాబాద్ అంటేనే వ‌ర‌ల్డ్ క్లాస్ సిటీ అని తన ట్వీట్ లో పేర్కొన్నారు కేటీఆర్. ఎవ‌రైనా స‌రే ఒప్పుకోక త‌ప్ప‌ని నిజం ఇదని చెప్పారు. దేశంలోనే అత్యంత వేగంగా హైద‌రాబాద్ న‌గ‌రం అభివృద్ధి చెందిందని, హైద‌రాబాద్ విశ్వ‌న‌గ‌రంగా రూపాంత‌రం చెందిందని అన్నారాయన. బెంగ‌ళూరు, హైద‌రాబాద్ సిటీల‌ను పోల్చుతూ రిఫ‌రెన్స్‌గా హైద‌రాబాద్ ఫొటో వాడ‌టంపై కేటీఆర్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. హైద‌రాబాద్ అంటే ఇదీ అని పేర్కొన్నారు.

First Published:  10 April 2024 3:04 PM IST
Next Story