తెలంగాణ: రేపు విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు
తెలంగాణ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం నాడు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు దినంగా ప్రకటించింది.
BY Telugu Global16 Sept 2022 8:03 PM IST
X
Telugu Global Updated On: 16 Sept 2022 8:14 PM IST
తెలంగాణ ప్రభుత్వం రేపు అన్ని విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించింది. తెలంగాణ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వేడుకలను నిర్వహిస్తున్న నేపథ్యంలో సెప్టెంబర్ 17ను సెలవు దినంగా ప్రకటించాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కొద్ది సేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేశారు.
Next Story