Telugu Global
Telangana

గ్రూప్-1 అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక విజ్ఞప్తి

తెలంగాణలో గ్రూప్‌-1 ఫలితాలు అతి త్వరలోనే విడుదల చేస్తామని టీజీపీఎస్సీ ప్రకటించింది.

గ్రూప్-1 అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక విజ్ఞప్తి
X

తెలంగాణలో గ్రూప్‌-1 ఫలితాలు అతి త్వరలోనే విడుదల చేస్తామని టీజీపీఎస్సీ ప్రకటించింది. ఎలాంటి తప్పులు లేకుండా పారదర్మకంగా జరుగుతుందని స్పష్టం చేశారు. సోషల్‌ మీడియాలో జరుగుతోన్న అసత్య ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. అభ్యర్థులు తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు అని విజ్ఞప్తి చేసింది. మార్కుల జాబితాను వెబ్‌సైట్‌లో పెడతామని.. అభ్యర్థుల లాగిన్‌లో పేపర్ల వారీగా మార్కులు ఉంచుతామని పేర్కొంది. రాష్ట్రంలో 563 గ్రూప్‌-1 పోస్టులకు నిర్వహించిన మెయిన్స్‌ పరీక్షల ఫలితాల విడుదలపై అభ్యర్థులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

First Published:  5 March 2025 9:29 PM IST
Next Story