Telugu Global
Telangana

గ్రూప్ -4 ఫలితాలు విడుదల

తుది ఫలితాలు విడుదల చేసిన టీజీపీఎస్సీ

గ్రూప్ -4 ఫలితాలు విడుదల
X

గ్రూప్‌ -4 తుది ఫలితాలు విడుదల చేశామని టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్‌ నికోలస్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2022 డిసెంబర్‌ ఒకటిన 8,180 పోస్టుల భర్తీకి గ్రూప్‌ -4 నోటిఫికేషన్‌ ఇచ్చామని తెలిపారు. మొత్తం 9,51,321 మంది ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. 2023 జూలై ఒకటిన రాత పరీక్ష నిర్వహించామని, రాత పరీక్షలో ప్రతిభ కనబరిచిన వాళ్లతో ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున మెరిట్‌ జాబితా విడుదల చేశామన్నారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం 8,084 మంది అభ్యర్థులతో కూడి ప్రొవిజనల్‌ సెలక్షన్‌ లిస్ట్‌ గురువారం విడుదల చేశామని వెల్లడించారు. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం టీజీపీఎస్సీ వెబ్‌ సైట్‌ ను సందర్శించాలని ప్రకటించారు. టీజీపీఎస్సీ సెక్రటరీ ప్రకటన ప్రకారం మరో 96 పోస్టులను భర్తీ చేయకుండా పెండింగ్‌ పెట్టారు.

First Published:  14 Nov 2024 7:06 PM IST
Next Story