కొత్త కోడ్, ఫ్యాన్సీ నంబరు.. రూ.9.61 లక్షలు పలికిన టీజీ 0001 నంబర్
హైదరాబాద్ పరిధిలోని ఆర్టీఏ కార్యాలయాల్లోనే టీజీ సిరీస్ ఓపెన్ చేశారు. ఖైరతాబాద్, టోలీచౌకి, అత్తాపూర్, నాగోల్, బండ్లగూడ, తిరుమలగిరి, మలక్‌పేట, ఇబ్రహీంపట్నం, కూకట్‌పల్లి, మేడ్చల్ ఆర్టీవో కార్యాలయాల్లో టీజీ కోడ్‌తో రిజిస్ట్రేషన్ ప్రారంభించారు.
తెలంగాణలో వాహనాలకు టీజీ నూతన సిరీస్ ప్రారంభమైంది. కొత్త సీరియల్ కావడంతో ఫ్యాన్సీ నంబర్లు వస్తాయని వాహనదారులు లక్షలు పోసి నంబర్లు దక్కించుకుంటున్నారు. దీనిలో భాగంగా టీజీ 0001 నంబర్‌ను రాజీవ్‌కుమార్ అనే వ్యక్తి 9,61,111 రూపాయలకు వేలంలో దక్కించుకున్నారు.
కొత్తగా కొన్న వాహనాలకే టీజీ సిరీస్
ఇప్పటివరకు రాష్ట్రంలో టీఎస్‌గా ఉన్న వాహనాలు యథావిధిగా ఉంటాయి. లేటెస్ట్‌గా వాహనాలు కొన్నవారికే టీజీ సిరీస్ వస్తోంది. ముందుగా హైదరాబాద్ పరిధిలోని ఆర్టీఏ కార్యాలయాల్లోనే టీజీ సిరీస్ ఓపెన్ చేశారు. ఖైరతాబాద్, టోలీచౌకి, అత్తాపూర్, నాగోల్, బండ్లగూడ, తిరుమలగిరి, మలక్‌పేట, ఇబ్రహీంపట్నం, కూకట్‌పల్లి, మేడ్చల్ ఆర్టీవో కార్యాలయాల్లో టీజీ కోడ్‌తో రిజిస్ట్రేషన్ ప్రారంభించారు.
కొత్త కోడ్, ఫ్యాన్సీనంబర్
అసలే టీజీ పేరుతో కొత్త కోడ్, అందునా 0009, 0099 వంటి ఫ్యాన్సీ నంబర్లు రావడంతో వాహనదారులు లక్కీనంబర్ల బిడ్డింగ్‌లో చెలరేగిపోయారు. ఒక్క హైదరాబాద్ మహానగర పరిధిలోనే మూడు రోజుల్లో ఏకంగా రూ.1.32 కోట్లు ఫీజు రూపంలో వచ్చింది. దీనిలో 90 లక్షల ఫ్యాన్సీ నంబర్లకే రావడం విశేషం.