Telugu Global
Telangana

తెలంగాణ ఈఏపీ సెట్‌, పీజీ ఈసెట్‌ షెడ్యూల్‌ ఇదే!

మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్‌, ఏప్రిల్‌ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మా పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపిన ఉన్నత విద్యా మండలి

తెలంగాణ ఈఏపీ సెట్‌, పీజీ ఈసెట్‌ షెడ్యూల్‌ ఇదే!
X

తెలంగాణ ఈఏపీ సెట్‌ ఖరారైంది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి వెల్లడించింది. ఫిబ్రవరి 22 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మా పరీక్షలు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి తెలిపింది. ఈఏపీ సెట్‌ పరీక్షలు జేఎన్‌టీయూ నిర్వహించనున్నది.

పీజీ ఈసెట్‌ షెడ్యూల్‌ ఇదే

తెలంగాణ పీజీ ఈసెట్‌ షెడ్యూల్‌ను ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. మార్చి 12న నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. మార్చి 17 నుంచి 19 వరకు దరఖాస్లులు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. జూన్‌ 16 నుంచి 19 వరకు పరీక్షలు జరగనున్నాయి.

First Published:  3 Feb 2025 3:39 PM IST
Next Story