Telugu Global
Andhra Pradesh

ఏపీలో టెట్‌ ఫలితాలు విడుదల

ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ఫలితాలు విడుదలయ్యాయి. మానవవనరుల శాఖ మంత్రి నారా లోకేశ్‌ నేడు ఫలితాలను విడుదల చేశారు.

ఏపీలో టెట్‌ ఫలితాలు విడుదల
X

ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ఫలితాలు విడుదలయ్యాయి. విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ ఇవాళ ఉదయం ఫలితాలను విడుదల చేశారు. టెట్‌ ఫలితాలను cse.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా టెట్‌ అర్హత సాధించిన అభ్యర్థులకు ట్విట్టర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. 50.79 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.

ఫలితాల కోసం https://aptet.apcfss.in/CandidateLogin.do చూడవచ్చు. అక్టోబర్‌ 3 నుంచి 21 వరకు టెట్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా, 3,68,661 మంది హాజరయ్యారు. ఇందులో 1,87,256 మంది అర్హత సాధించారు. ఇటీవల ప్రాథమిక కీ, రెస్పాన్స్‌షీట్‌లను విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం అక్టోబర్‌ 29న ఫైనల్‌ కీ విడుదల చేసిన విషయం తెలిసిందే. త్వరలో 16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నిర్వహించనున్నారు

First Published:  4 Nov 2024 11:29 AM GMT
Next Story