ఎనుమాముల మార్కెట్‌లో ఉద్రిక్తత
కొన్నిరోజులుగా పత్తి ధర తగ్గిందని రైతులు ఆందోళన. చర్చల అనంతరం యథావిధిగా కొనుగోళ్లు
BY Raju Asari25 Oct 2024 1:43 PM IST
X
Raju Asari Updated On: 25 Oct 2024 1:43 PM IST
వరంగల్ ఎనుమాముల మార్కెట్‌లో ఉద్రిక్తత నెలకొన్నది. కొన్నిరోజులుగా పత్తి ధర తగ్గిందని రైతులు ఆందోళన చేపట్టారు. దీంతో మార్కెట్‌లో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. కొనుగోళ్లు నిలిచిపోవడంతో పత్తి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోళ్ల కోసం రైతులు మూడు గంటలు వేచి చూశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోళ్లను పరిశీలించడానికి తెలంగాణ రైతు సంఘాలు మార్కెట్‌కు రావడంతో వ్యాపారులు కొనుగోళ్లు చేసేది లేదంటూ వెనుదిరిగారు. కొనుగోళ్లు చేయాలని రైతు సంఘం నేతలు ఆందోళనకు దిగారు. పోలీసులు రావడంతో ఆందోళన సద్దుమణిగింది. మార్కెట్ కార్యదర్శి వ్యాపారులు, రైతు సంఘాల నేతలు, వ్యాపారులు చర్చించి సమస్య పరిష్కరించడంతో యథావిధిగా కొనుగోళ్లు సాగుతున్నాయి.
Next Story