Telugu Global
Telangana

సాగరహారానికి పదేళ్ళు..అప్పుడు మీజాడ ఎక్కడ ? -కేటీఆర్ ట్వీట్

హైదరాబాద్ లో సాగరహారం జరిగి ఈ రోజుకు పదేళ్ళు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. రాష్ట్ర ప్ర‌భుత్వంపై ప్ర‌తి రోజు ప‌నికిమాలిన విమ‌ర్శ‌లు చేసే ప్ర‌తిప‌క్ష నేత‌లు తెలంగాణ ఉద్యమ సమ‌యంలో ఏం చేస్తున్నారంటూ ఆయన తన ట్వీట్ లో ప్రశ్నించారు.

సాగరహారానికి పదేళ్ళు..అప్పుడు మీజాడ ఎక్కడ ? -కేటీఆర్ ట్వీట్
X

ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఎగసిపడుతున్న సమయం లో సాగర హారం జరిగింది. చివరి క్షణం వరకు పర్మిషన్ ఇవ్వకుండా అప్పటి ప్రభుత్వం ఇబ్బందులు పెట్టినా .... సరిగ్గా పదేళ్ల కిందట ఈ రోజు(సెప్టెంబర్ 30న) హైదరాబాద్ నగరంలోని హుస్సేన్‌సాగర్ తీరం లక్షల మంది ప్రజలతో నిండిపోయింది. హుస్సేన్ సాగరతీరంలో అనేక ఆంక్షలనూ, ఆటంకాలనూ, నయవంచనలనూ, హామీల ఉల్లంఘనలనూ అధిగమించి జరిగిన సాగరహారం జీవితంలో అత్యంత అరుదుగా అనుభవమయ్యే మహాద్భుత ఉద్వేగభరిత జన కావ్యం.

అలాంటి సాగర హారం గురించి మంత్రి కేటీఆర్ ఈ రోజు ఓ ట్వీట్ చేశారు. సాగరహారం గొప్ప ఉద్యమ సందర్భమని చెప్పిన కేటీఆర్ ఆ రోజు మీ జాడ ఎక్కడంటూ ప్రతిపక్షనాయకులను ప్రశ్నించారు కేటీఆర్.

రాష్ట్ర ప్ర‌భుత్వంపై ప్ర‌తి రోజు ప‌నికిమాలిన విమ‌ర్శ‌లు చేసే ప్ర‌తిప‌క్ష నేత‌లు రేవంత్ రెడ్డి, బండి సంజ‌య్, ప్ర‌వీణ్ కుమార్‌, ష‌ర్మిలలు తెలంగాణ ఉద్యమ సమ‌యంలో ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు.

కేటీఆర్ చేసిన ట్వీట్ : ''సాగరహారానికి నేటితో పదేళ్లు

తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో పతాక స్థాయికి తీసుకెళ్లిన సందర్భం.. లక్షల గొంతుకలు 'జై తెలంగాణ' అని నినదించిన రోజు.

ప్రతిరోజు పనికిమాలిన విమర్శలు చేసే ప్రతిపక్ష రేవంత్, బండి సంజయ్, ప్రవీణ్ కుమార్, షర్మిల తెలంగాణ ఉద్యమంలో మీ జాడ ఎక్కడ?''

కేటీఆర్ చేసిన ఈ ట్విట్ కు స్పందన గా అనేక మంది నేటిజనులు తమ సాగరహార అనుభవాలను పంచుకున్నారు. అప్పడు తాము ఆ ఉద్యమంలో పాల్గొన్నప్పటి ఫోటోలను షేర్ చేశారు.


First Published:  30 Sept 2022 12:31 PM GMT
Next Story